ఆంధ్ర ప్రదేశ్

మరో అల్పపీడనం.. నాలుగు రోజులపాటు భారీ వర్షాలు!

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈనెల 21వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడుతుంది అని.. దీని ద్వారా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖ అధికారులు కీలక ప్రకటన చేశారు. ఈనెల 19వ తేదీ నాటికి అండమాన్ మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈనెల 21వ తేదీ నుంచి వాతావరణంలో పలు మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. తద్వారా ఈనెల 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కూడా కోస్తా మరియు రాయలసీమ జిల్లాలలో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మొంథా తుఫాన్ ఎంత నష్టం కలిగించిందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ నేపథ్యంలోనే మరో మూడు రోజుల నుంచి నాలుగు రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉండడంతో వ్యవసాయదారులందరూ కూడా జాగ్రత్తలను తీసుకోవాలి అని సూచించారు. కాబట్టి 24 నుంచి 27వ తేదీ వరకు కూడా వాహనదారులు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. మరోవైపు ఇప్పటికే చలి కారణంగా ప్రతి ఒక్కరు కూడా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.

Read also : ప్రతి ఒక్కరూ అంకితభావంతో పని చేయాలి : చైర్మెన్ కుంభం

Read also : Broccoli: చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడే సూపర్‌ఫుడ్

Back to top button