Tuesday, February 24, 2026
Homeక్రైమ్భార్య వేధింపులతో ప్రముఖ కేఫ్ యజమాని ఆత్మహత్య

భార్య వేధింపులతో ప్రముఖ కేఫ్ యజమాని ఆత్మహత్య

భార్య వేధింపు ఘటనలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. భార్యల టార్చర్ తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు భర్తలు. బెంగళూరు అతుల్ సుభాశ్ ఆత్మహత్య తరహాలోనే భార్య వేధింపులకు మరో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాజాగా ఢిల్లీలో భార్య వేధింపులతో ఉరి వేసుకొని ప్రముఖ కేఫ్ యజమాని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఢిల్లీ – కళ్యాణ్ విహార్‌ ప్రాంతానికి చెందిన పునీత్ ఖురానా(40), అతని భార్య మానికా జగదీశ్ పహ్వా ఇద్దరు కలిసి ఉడ్‌బాక్స్ కేఫ్ అనే బేకరి పెట్టారు.కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరగడంతో విడాకులు తీసుకోగా, ఆ కేసు కోర్టులో నడుస్తుంది.పునీత్‌ను అతని భార్య మానికా ఫోన్ చేసి మనం విడాకులు తీసుకున్నాం.. కానీ, నేను ఇంకా వ్యాపార భాగస్వామినే.. నాకు రావాల్సిన మొత్తం చెల్లించాల్సిందే అంటూ వేధింపులకు గురిచేసింది.

దీంతో తన ఇంట్లో పునీత్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.. పునీత్ ఫోన్‌లో తన భార్యతో మాట్లాడిన 16 నిమిషాల కాల్ రికార్డ్‌ను పోలీసులు గుర్తించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పునీత్ భార్యను విచారణకు హాజరు కావాలని నోటీసు పంపారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments