క్రైమ్జాతీయం

భార్య చేతిలో నేడు మరో భర్త బలి.. సాంబార్ లో విషం కలిపి మరీ? ఇంకెన్ని చూడాలో?

– భార్య చేతిలో నేడు మరో భర్త బలి
– అన్ని మృతులకు అక్రమ సంబంధాలే కారణం..
– భవిష్యత్తులో ఇంకెన్ని మరణాలు చూడాల్సి వస్తుందో?..

క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- రెండు తెలుగు రాష్ట్రాలే.. అనుకున్నాం. కాని ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి చాలా దారుణాలు జరుగుతున్నాయి. “భార్య చేతిలో భర్త బలి”… అనే కాన్సెప్ట్ వార్తలు చాలా రోజుల నుంచి సోషల్ మీడియా లేదా పేపర్లలో చూస్తూనే ఉన్నాం. నిత్యం ప్రతిరోజు కూడా ఈ హెడ్ లైన్స్ లేనిదే సోషల్ మీడియాలో రోజు గడవాలంటే నమ్మకం కుదరడం లేదు. ఈ రాష్ట్రం కాకపోతే మరో రాష్ట్రం… కానీ భార్య చేతిలో భర్త మృతి మాత్రం పక్కాగా జరుగుతుంది.

ఇక తాజాగా తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లాలో భార్య చేతిలో భర్త బలైయ్యాడు. దీనికి కారణం అక్రమ సంబంధం. సాంబార్ లో విషం కలిపి మరి భర్తను హతమార్చింది భార్య. రసూల్ అనే వ్యక్తి డ్రైవర్ పని చేసుకుంటూ ఉంటాడు. తన భార్య చిన్నచిన్న కూలి పనులకు వెళుతుంది. ఒకరోజు అన్నం తినిన రసూల్ వాంతులు చేసుకొని స్పృహ కూలిపోయి కింద పడిపోయాడు. వెంటనే అతని కుటుంబీకులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు. అయితే కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చిన డాక్టర్లు ఇతను విషం కలిపిన ఫుడ్ తినడం వల్లనే చనిపోయాడని డాక్టర్లు చేసిన టెస్టుల్లో అసలు నిజం తెలిసింది. దీంతో వెంటనే ఆమె భార్యపై డౌట్ పడిన బంధువులు ఆమె ఫోన్ తీసుకొని వాట్సప్ చూడగా.. అందులో” నువ్విచ్చిన విషయం సాంబార్లో కలిపా”.. అని నువ్వు తెలియని యువకుడుతో చాట్ చేయడం చూశారు. దీంతో వెంటనే బంధువులు పోలీసులకు ఈ విషయం తెలియజేయగా.. రసూల్ భార్యను అలాగే చాట్ చేసిన ప్రియుడిని ఇద్దరినీ కూడా అరెస్ట్ చేశారు. దీంతో ఈ విషయాలు తెలుసుకుంటున్న ప్రేక్షకులు పెళ్లి చేసుకోవాలంటేనే భయపడుతున్నారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో పోలీసులపై రాళ్లదాడి… పోడు భూములు లాక్కుంటున్నారని ఆగ్రహం

పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన రోజా… దమ్ముంటే 175 సీట్లలో పోటీ చేయి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button