
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- క్రికెట్ ఆడుతున్న సమయంలో యువత అనూహ్య పరిణామాలతో మృతి చెందిన సంఘటనలు నిత్యం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ లో ఇలాంటిదే ఒక విషాదం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియన్ క్రికెటర్ అయినటువంటి బెన్ ఆస్టిన్ అనే 17 సంవత్సరాల యువ క్రికెటర్ బంతి తగలడం కారణంగా మృతి చెందాడు. ఆస్ట్రేలియాలోని మేల్ బోర్న్ లో నెట్ లో ప్రాక్టీస్ చేస్తుండగా బిన్ మెడకు బంతి తగలడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే అభివృద్ధి చెందాడు. ఇక వెంటనే అతని మృతి విషయాన్ని తెలుసుకున్న క్రికెట్ ఆస్ట్రేలియా బెన్ ఆస్టిన్ మృతి పట్ల సంతాపం తెలియజేసింది. ఆస్ట్రేలియా క్రికెట్ కు మంచి భవిష్యత్తు ఉన్నటువంటి యువ ఆటగాడిని దురదృష్టవశాత్తు కోల్పోయామని పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో ఇటువంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. గతంలో కూడా దాదాపు 11 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా బ్యాటర్ అయినటువంటి ఫిలిప్ హ్యూస్ కూడా బంతి తాకడంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీంతో క్రికెట్ ఆడుతూ పలు కారణాల వల్ల మృతి చెందిన సంఘటనలు ఎక్కువగా ఆస్ట్రేలియాలోనే జరిగాయి. కాగా ఇటువంటి సంఘటనలు మన భారత్ లో జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దానికి తగ్గట్టుగా హెల్మెట్స్ మరియు ప్యాడ్స్ ఇలాంటివి ఉపయోగిస్తూనే ఉండాలని సూచించారు.
Read also : తుఫాన్ ఎఫెక్ట్ తగ్గిందని ఆనందపడుతున్నారా..? ఆరోగ్య విషయంలో జాగ్రత్త!
Read also : కొట్టుకుపోయిన హైదరాబాద్–శ్రీశైలం హైవే..!





