
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుస బస్సు ప్రమాదాలు చోటు చేసుకోవడం కలకలం రేపుతుంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రమాదాల కారణంగా పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. అయినా కానీ బస్సు డ్రైవర్లు మళ్లీ నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారు. దీనికి ఉదాహరణ నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన మరో ఘటనే.. ఇక అసలు వివరాల్లోకి వెళితే ఎన్టీఆర్ జిల్లా.. నందిగామ శివారు అనాసాగరం వద్ద కావేరి ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళుతుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. లారీని ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో బస్సు ముందు మరియు ఎడమవైపు భాగం పూర్తిగా దెబ్బతింది. ఇక ఈ బస్సులో మొత్తంగా 20 మంది ప్రయాణికులు ఉండగా అందులో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు స్పందించి వెంటనే గాయాలు పాలైన వారిని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనలో ఒక్కరి ప్రాణాలు కూడా కోల్పోకపోవడంతో ప్రతి ఒక్కరు కూడా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో రాష్ట్రంలో వరుస బస్సు ప్రమాదాల సంఘటనలు ప్రతి ఒక్క ప్రయాణికుడిని కూడా భయానికి గురి చేస్తున్నాయి. బస్సులలో ప్రయాణాలు చేయాలి అంటేనే ఒకటికి రెండు,మూడు సార్లు ఆలోచిస్తున్నారు. ఇప్పటికైనా డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించి .. ప్రయాణికులను గమ్యస్థానానికి క్షేమంగా చేర్చాలి అని చాలామంది ప్రయాణికులు డ్రైవర్లకు సూచనలు చేస్తున్నారు.
Read also : ఏపీలో భారీ వర్షాలు.. అల్పపీడనమే కారణం.. ఈ జిల్లాలో అలర్ట్!
Read also : పెబ్బేరు లో ఘనంగా 14వ వార్షికోత్సవ శోభ యాత్ర





