
క్రైమ్ మిర్రర్, అమరావతి :- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 3 గంటల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉరుములు వచ్చే సమయంలో రైతులు పొలాల్లో ఉండొద్దని చెప్పింది. చెట్ల కిందకు కూడా వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు.
వర్షం పడుతున్న సమయంలో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు సూచించారు. ఉత్తరాంధ్ర, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి తెలిపారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఓవైపు ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. తీవ్రమైన ఎండ వేడితో, ఉక్కపోతతో జనాలు విలవిలలాడిపోతున్నారు. అటు కొన్ని చోట్ల వానలు పడుతున్నాయి. 56 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ చెబుతోంది.