ఆంధ్ర ప్రదేశ్

వర్షాలు నేపథ్యంలో స్కూళ్ల కు సెలవు ఇవ్వాలని డిమాండ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న కారణంగా ఇవాళ స్కూళ్లకు సెలవు ఇవ్వాలని కొన్ని జిల్లాలలోని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిన విషయం మనందరికీ తెలిసిందే. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం గా మారి రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మోస్తారు వర్షాలు కురిసేటివంటి అవకాశం ఉంది.

విగ్గు పెట్టుకుని అమ్మాయిలు మోసం చేస్తున్న గచ్చిబౌలి యువకుడు?

ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, మన్యం, అనకాపల్లి, అన్నమయ్య జిల్లాల్లో సహా రాత్రి నుండి ఇప్పటివరకు కూడా వర్షం పడుతూనే ఉంది. ఈ కారణంగానే ఆ జిల్లాలోని విద్యార్థుల తల్లిదండ్రులు స్కూళ్లకు ఇవాళ సెలవు ఇవ్వాలని అధికారులను కోరుతున్నారు. వర్షాల్లో స్కూలు మరియు కాలేజీలకు వెళ్లేందుకు విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని, కాబట్టి ముందుగా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఇవాళ ఒక రోజు సెలవు ప్రకటించాలని కోరారు.

మా కాలనీకి ‘పాకిస్తాన్’ పేరు వద్దంటూ ఆందోళనలు

కాగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే రెండు అల్పపీడనాల కారణంగా భారీ నుండి భారీ వర్షాలు కొన్ని రోజుల నుండి కురుస్తూనే ఉన్నాయి. మొన్నటిదాకా కోస్తా ఆంధ్ర వైపు కురిసిన వర్షాలు ఇవ్వాలా ఉత్తరాంధ్ర పై దండెత్తుతున్నాయి. కాబట్టి పంట చేతికి వచ్చే సమయంలో వ్యవసాయదారులు కూడా చాలామంది నష్టపోయాము అంటూ ప్రభుత్వాన్ని నష్టపరిహారం కోసం వేడుకుంటున్నారు. కాబట్టి ఈ వర్షాలు అనేవి వ్యవసాయదారులకు తీరని లోటుగా మిగిలిపోయాయి. ఇప్పటికే చాలామంది వాతావరణ శాఖ అధికారులు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు.

రేపే కేటీఆర్ అరెస్ట్? రేవంత్ ఉన్న బ్యారక్ రెడీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button