ఆంధ్ర ప్రదేశ్

జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం!.. చాలామంది పారిపోయారు : ఏపీ సీఎం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. పండుగల సంస్కృతిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీ జీఎస్డీపీ ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్ 2024-25పై మీడియాతో మాట్లాడిన సీఎం, రాయలసీమలో జల్లికట్టు పోటీలు గ్రామాలకు 10 లక్షల మందిని ఆకర్షించాయని, తమ మూలాలను గుర్తు పెట్టుకోవడం ఒక మంచి అలవాటని చెప్పారు. తెలుగు ప్రజలు గ్లోబల్ స్థాయిలో ఎదుగుతున్నారని, గతం కన్నా ఈ సంక్రాంతికి రాష్ట్రంలో రోడ్లలో స్పష్టమైన మార్పులు కనిపించాయన్నారు.

టీమ్ ఇండియా ప్లేయర్లకు కఠిన ఆంక్షలు విధించిన బీసీసీఐ !..

పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ, ‘‘ఏపీకి పోలవరం జీవనాడి, కానీ వైసీపీ హయాంలో దీనిని గోదావరిలో కలిపేశారని’’ మండిపడ్డారు. గత పాలకులు ప్రజలకు స్వేచ్ఛ ఇవ్వకుండా వ్యవస్థలను పాడుచేశారని, రాష్ట్రానికి రావడానికి కూడా చాలామంది భయపడినట్టుగా విమర్శించారు. పారిశ్రామిక వేత్తలు కూడా భయపడ్డారని చెప్పారు. సంపద సృష్టించి ఆదాయం పెరిగితే, పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేసి, పెద్దవారిని పైకి తీసుకురావచ్చని వివరించారు.

ఆర్థిక సంస్కరణలు ఫలితాలను ఇచ్చాయని, ‘‘నేను వాటిని నమ్మాను’’ అన్నారు. విద్యుత్ సంస్కరణలు తీసుకువచ్చి వెలుగులు పెంచానని, ఐటీ రంగాన్ని ప్రోత్సహించి అనేక కుటుంబాలకు జీవనోపాధి కల్పించానని తెలిపారు. హైదరాబాద్ ఇప్పుడు నంబర్ 1 నగరంగా ఎదిగింది, తెలంగాణకు ఎక్కువ ఆదాయం అందిస్తోందని చెప్పారు.‘సంపద పెరిగితే ఆదాయం కూడా పెరుగుతుంది’ అని, పీ-4 ప్రాజెక్టు సమాజంలో మార్పు తేవడం కోసం ఒక గేమ్ చేంజర్ అవుతుందని చెప్పారు. ‘జీఎస్‌డీపీ పెరిగితే, 2047 నాటికి 58 లక్షల 14 వేలు 916 కోట్ల తలసరి ఆదాయం సాధిస్తామని’ చెప్పుకొచ్చారు.

ఆఫ్ లైన్ పద్ధతి లోనే నీట్ యూజి 2025 పరీక్షలు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button