
మాదాపూర్, క్రైమ్ మిర్రర్:- దుర్గం చెరువులో గుర్తు తెలియని మృతి దేహం లభ్యమైన ఘటన సోమవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుర్గం చెరువులో గుర్తు తెలియని వ్యక్తి పడి ఉన్నాడని సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, నీళ్లలో పడి మృతి చెందిన గుర్తు తెలియని శవాన్ని గుర్తించారు. డిఆర్ఎఫ్ హైద్రా టీమ్ సహాయంతో శవాన్ని బయటకు తీసి పరిశీలించగా మృతుని వయస్సు సుమారు 30 నుండి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని అంచనా వేశారు. అతను ఎల్లో రంగు టీ షర్టు, బ్లాక్ రంగు ట్రాక్ ప్యాంట్, పర్పుల్ రంగు డిక్సీ స్కాట్ నెక్కర్ ధరించి ఉండగా, తల వెంట్రుకలు నల్లగా ఉండి, శరీరం పూర్తిగా ఉబ్బి, చేతులు కాళ్ల వేళ్ల చర్మం ఊడిపోయి ఉన్నట్లు గుర్తించారు. మృతుని వద్ద బ్లాక్ రంగు కళ్లద్దాలు (వైట్ లెన్స్) మరియు బ్లాక్ రంగు జీ స్టాక్ వాచ్ ఉన్నాయి. ఈ వ్యక్తి గురించి ఏవైనా వివరాలు తెలిసిన వారు మాదాపూర్ పోలీస్ స్టేషన్ సెల్ నెంబర్ 8712663109 లేదా 8712663100 లేదా 8712567299 కు వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Read also : మళ్లీ ఇందిరమ్మ చీరల పంపిణీ.. ఈసారి వారికి మాత్రమే
Read also : గంజాయి మత్తులో వీరంగం.. ఇద్దరు మహిళలపై దారుణం (VIDEO)





