క్రైమ్తెలంగాణ

జగిత్యాల జిల్లాలో ఘోరం: ప్రేమ జంటపై దాడి అమ్మాయి కిడ్నాప్..!

క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు కర్రలు, ఇనుప రాడ్లతో  దాడి చేసి, అమ్మాయిని కిడ్నాప్ చేసిన ఘటన మంగళవారం జగిత్యాల జిల్లాలో స్థానికంగా కలకలం రేపింది. అయితే ఈ  దాడి, యువతి కిడ్నాప్ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.

ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…తెలంగాణా రాష్టం జగిత్యాల జిల్లా మల్యాకు చెందిన నల్ల ముత్తుకుమార్ (27), ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సోముల మాధవి (24) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వారం రోజుల క్రితం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు.

ఈ క్రమంలో మంగళవారం  నవంబర్ 25న, మాధవి తల్లిదండ్రులు, బంధువులు కర్రలు, ఇనుప రాడ్లతో ముత్తుకుమార్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. వారు యువకుడిని కొట్టి, మాధవిని బలవంతంగా తమతో పాటు తీసుకెళ్లారు. అయితే ఈ దాడి మరియు కిడ్నాప్ స్థానికంగా కలకలం రేపింది అని చెప్పొచు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి పరువు హత్యలు (honour killings) మరియు దాడులు తెలంగాణలో గతంలోనూ జరిగాయి. ప్రేమ వివాహాలు చేసుకున్న జంటలకు రక్షణ కల్పించేందుకు activists చట్టాలు తీసుకురావాలని కోరుతున్నారు.

బాధితులు తక్షణ సహాయం కోసం స్థానిక పోలీసులను లేదా మహిళా హెల్ప్‌లైన్‌లను సంప్రదించవచ్చు అని అధికారులు చుసిస్తున్నారు.ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button