
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- బంగ్లాదేశ్ లో ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడిన విషయం మనందరికీ తెలిసిందే. బంగ్లాదేశ్ లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న దాడులు యావత్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది హిందువులు దారుణంగా చంపబడగా కొంతమంది గాయాలు పాలు అవుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే బంగ్లాదేశ్ లో మైనారిటీ హిందువులు జీవించాలి అంటేనే నరకంగా మారింది. కాబట్టి బంగ్లాదేశ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తాజాగా ఈ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత దేశ అభిమానుల డిమాండ్ ప్రకారం ఐపిఎల్ లో ముస్తఫిజర్ రెహమాన్ ను తొలగించిన విషయం తెలిసిందే. అయితే మరోవైపు బంగ్లాదేశ్ కెప్టెన్ గా లిటన్ దాస్ ఎప్పటినుంచో కొనసాగుతున్నారు. ఇక్కడ అసలైన మ్యాటర్ ఏంటంటే అతను ఒక హిందూ అవడం… హిందువు కావడం తో వెంటనే కెప్టెన్ ను తొలగించాలి అని బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఒక హిందువు కెప్టెన్ గా ఉండడం ఏంటి అని తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ అభిమానులే అతన్ని ఘోరంగా ట్రోల్స్ చేస్తున్నారు. మ్యాచ్ లు జరుగుతున్న ఆయా సందర్భాలలో కెప్టెన్ నే హిందువు అవడంతో దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో ఆ దేశ క్రికెటర్ అలాగే కెప్టెన్ పైనే ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అని ఇండియాలోని ప్రతి ఒక్కరు కూడా దీనిపై చర్చిస్తున్నారు.
Read also : రోజా VS జనసేన అభిమానులు.. సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్?
Read also : మేడారం జాతర పనులు ఈనెల 20 లోపు పూర్తవుతాయి : మంత్రి పొంగులేటి





