
తెలంగాణలో కాంగ్రెస్ నేతల వసూళ్ల దందా పెరిగిపోయిందనే ఆరోపణలు వస్తున్నాయి. స్థానిక నేతల నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల వరకు.. ఎవరి స్థాయిలో వాళ్లు తమకు తోచిన విధంగా దండుకుంటున్నారనే ఫిర్యాదులు భారీగా వస్తున్నాయి. తాజాగా హైడ్రా పేరుతో కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడి బాగోతం బయటికి వచ్చింది.
తాను అడిగినన్ని కోట్ల రూపాయలు ఇవ్వకపోతే మీ ఇంటి మీదకి హైడ్రా పంపించి మొత్తం కూలగొట్టిస్తా అంటూ సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తన వెనక, రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, జగ్గారెడ్డి ఉన్నారని సదరు నేత బెదిరింపులకు దిగుతున్నారని చెబుతున్నారు.
Also Read : నల్గొండ మంత్రులు హెలికాప్టర్ మంత్రులు.. దామోదర సీరియస్ కామెంట్స్
తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ జెనరల్ సెక్రెటరీ ఎంఏ ఫహీమ్ బెదిరింపులు తట్టుకోలేక లేఖ రాశారు అమీన్‌పూర్ వెల్ఫేర్ అసోసియేషన్. సీఎం రేవంత్ రెడ్డి కోటరీలో ఎంఏ ఫహీమ్ కీలకంగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. hmda పరిధిలో భూ లావాదేవీలన్ని అతనే చూస్తున్నారని టాక్ నడుస్తోంది. రెవిన్యూ అధికారులంతా ఫహీం చెప్పినట్లే చెస్తున్నారని.. అలా చేయాలని రెవిన్యూ శాఖ ఉన్నతాధికారులకు ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు ఉన్నాయంటున్నారు.
ఒకవైపు హైడ్రా పేరుతో డబ్బులు అడిగినా, బెదిరింపులకు పాల్పడినా చర్యలు తీసుకుంటామని నీతులు చెప్తున్నారు హైడ్రా కమిషనర్. అయితే స్వయంగా రేవంత్ రెడ్డి అనుచరుడు డబ్బులు అడుగుతూ ఇవ్వకపోతే మీ మీదకు హైడ్రా పంపుతానని బెదిరింపులకు పాల్పడుతున్నా హైడ్రా అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అమీన్ పూర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాసిన లేఖపై హైడ్రా ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందని జనం ప్రశ్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి ..
-
తెలంగాణలో ఫ్రూట్ జ్యూస్ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం.
-
మర్రిగూడ ఎంపిడివో రాజకీయం..!రాజకీయంగా మారిన కరువు పని?
-
కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!
-
కోమటిరెడ్డిపై గుత్తా తిరుగుబాటు.. రెండుగా చీలిన నల్గొండ కాంగ్రెస్?
-
ఆస్తి కోసం కూతురును చంపి సవతి తల్లి.. నదిలో పాతి పెట్టిన వైనం!..