
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- బీహార్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఘన విజయం సాధించిన తర్వాత నరేంద్ర మోడీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్ లో ప్రజలు తమ పార్టీని ఎంతలా అభిమానిస్తున్నారు అనేది మరోసారి ఎన్నికల ద్వారా స్పష్టంగా అర్థం అవుతుంది అని ప్రశంసించారు. అలాగే ఇతర పార్టీలు కేవలం అధికారం కోసమే ఎగబడుతున్నాయి.. వారికి మంచిగా బుద్ధి చెప్పారు అని పేర్కొన్నారు. ఇక బీహార్లో జైత్రయాత్రను మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ కొనసాగించాలని నరేంద్ర మోడీ ఆలోచనలో ఉన్నారు అని తెలుస్తుంది. ఎందుకంటే త్వరలోనే మరో కొన్నిచోట్ల ఎన్నికలు జరగనున్నాయి. నిన్న బీహార్ లో జరిగిన ఎన్నికలలో భారీ మెజారిటీతో ఎన్డీఏ ప్రభుత్వం ఘనవిజయాన్ని సాధించింది. ఇక ఇదే జోష్ లో త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు మరియు కేరళ ఎన్నికలలో కూడా భారీ మెజార్టీతో గెలిచేలా ప్లాన్ చేయాలి అని నరేంద్ర మోడీ ఆలోచిస్తున్నారు. ఇప్పటికే నా నెక్స్ట్ టార్గెట్ బెంగాలే అని మోడీ కీలక ప్రకటన చేశారు. మరోవైపు తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వం బలంగా లేకపోవడంతో.. అక్కడ గెలిచేందుకు శతవిధాలు కూడా ప్రయత్నాలు కొనసాగిస్తామని పార్టీ కార్యకర్తలు కూడా కీలకంగా వ్యవహరించాలి అని అన్నారు. వీటితోపాటుగా కేరళలో కూడా గెలిచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
Read also : ఆస్ట్రేలియన్ స్టార్ ఆల్ రౌండర్ ను వదులుకున్న పంజాబ్ కింగ్స్!
Read also : Gold Rates: తగ్గిన బంగారం ధరలు





