
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర రాజధానిగా అమరావతి పనులు వేగవంతంగా కొనసాగుతున్న సందర్భంలో సీఎం చంద్రబాబు నాయుడు రాజధాని పనుల గురించి మరోసారి ప్రస్తావించారు. రాజధాని అమరావతి కోసం, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఎంతగానో సహకరిస్తున్నారు అని చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ఇక రాజధాని పనులు ఇలానే కొనసాగితే 2028 మార్చి నెలలోపు అమరావతి నిర్మాణం పూర్తవుతుంది అని స్పష్టం చేశారు. ఇక బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మన అమరావతి లాంటి ఫైనాన్షియల్ సిటీ ఏ దేశంలో కూడా లేదు అని కొనియాడారు. ఈ బ్యాంకులు ఏర్పాటు ద్వారా దాదాపు 6500 కు పైగా యువతకు ఉద్యోగాలు వస్తాయి అని పేర్కొన్నారు. కాగా ఈ కార్యక్రమంలో భాగంగా మరోవైపు మంత్రి నారా లోకేష్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటిస్తే దానిని విధ్వంసం చేయడానికి చూశారు అని వైసిపి పార్టీపై మండిపడిన విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కేంద్ర సహకారంతో రాష్ట్ర అభివృద్ధి వేగంగా జరుగుతుంది అని అన్నారు. రాజధానిగా అమరావతి మరో రెండు మూడేళ్లు పూర్తయితే కనుక ఉద్యోగుల కోసం ఇకపై హైదరాబాదు అలాగే బెంగళూరు వంటి పట్టణాలకు మన రాష్ట్ర వాసులు వెళ్లేటువంటి అవసరం లేకుండా పోతుంది.
Read also : WHO: ఏ వయస్సు వారు ఎంత సేపు వ్యాయామం చేయాలంటే..?
Read also : అమరావతిని విధ్వంసం చేయడానికి ప్రయత్నించారు : నారా లోకేష్





