
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతున్నారు కూటమి ప్రభుత్వం. రెండు రోజుల క్రితమే ప్రధాని నరేంద్ర మోడీతో పునర్నిర్మాణ శంకుస్థాపన పనులు కూడా ప్రారంభించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అమరావతి రాజధాని అన్నది ఒక రాజకీయ అంశంగా మారడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇతర రాష్ట్రాలు కొత్తగా ఏర్పడినా కూడా అన్ని రాజకీయ పార్టీలు కలిపి వెంటనే రాజధానిని ఏర్పాటు చేసుకున్నాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయ పార్టీల మధ్య ఐక్యత లేకపోవడంతో రాజధాని ఇప్పటివరకు పూర్తి కాలేదు. 2014లో టిడిపి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అమరావతి రాజధాని అని నిర్ణయించింది. అప్పుడు ప్రతిపక్ష పార్టీ వైసిపి కూడా ఈ రాజధాని అమరావతికి ఆమోదం తెలిపింది. కానీ 2019లో వైసీపీ పార్టీ గెలిచిన తర్వాత రాజధాని మాటను మార్చింది వైసిపి.
ఇదంతా గమనించిన రాష్ట్ర ప్రజలు 2024లో 151 సీట్లు ఉన్న వైసీపీ పార్టీని 11 సీట్లకు దించింది. దీనికి ముఖ్య కారణం రాజధానిపై సరైన మాట లేకపోవడం. అయితే 2024లో మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు మాట ఇచ్చిన విధంగానే అమరావతి నే మళ్లీ రాజధానిగా పునర్నిర్మాణ శంకుస్థాపన పనులు మోదీ చేత ప్రారంభించారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అమరావతి శాశ్వత రాజధానిగా ఉండిపోతుందని భావాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇదే తరుణంలో అమరావతి కోసం వేలకోట్లు అప్పులు తెచ్చి అభివృద్ధికి బాట వేస్తే… మరి రాష్ట్రంలో మిగిలిన వెనుకబడిన ప్రాంతాల పరిస్థితి ఏంటని చాలామంది ప్రశ్నిస్తున్నారు.
ఏది ఏమైనా కూడా అమరావతి రాజధానికి వైసీపీ పూర్తిగా వ్యతిరేకంగా ఉందని జనాలకు వైసీపీ ప్రభుత్వంలో అర్థమయింది. ఇంకోవైపు చూస్తే ఏపీకి రాజధాని ఒక సెంటిమెంట్ గా మారిపోయింది. అమరావతి విషయంలో ఎవరు ఏమి చెప్పినా కూడా జనాలు పట్టించుకునే మూడ్లో లేరని… ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రానికి ఒక రాజధాని కావాలన్న భావనతో ఉన్నారని అర్థమవుతుంది. ఇప్పటికే అమరావతి సగం పనులు ప్రారంభం కాగా.. మిగతా పనులు కూడా శంకుస్థాపన జరగడంతో ఇక పూర్తి రాజధాని అమరావతిగా ఉండాలని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. ఇలా రాజధాని అడ్డుకోవడం వల్ల వైసీపీకి రాజకీయంగా నష్టమే తప్ప ఎటువంటి లాభం ఉండదని చాలామంది ప్రజలు అంటున్న మాటే.