దురంధర్ మూవీ డైరెక్టర్ తో అల్లు అర్జున్ సినిమా..?

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుస సినిమాలతో దూసుకుపోతూ బిజీబిజీ కాలాన్ని గడుపుతున్నారు. పుష్ప, పుష్ప-2 సినిమా తర్వాత అల్లు అర్జున్ రేంజ్ మారిపోయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో ఓ భారీ బడ్జెట్ మూవీలో అల్లు అర్జున్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం కొనసాగుతుంది అని సినీ వర్గాలు తెలిపాయి. అయితే మరోవైపు లోకేష్ కనగరాజ్ మరియు త్రివిక్రమ్ తోను అల్లు అర్జున్ సినిమా చేయనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా వరుస సినిమాలు కమిట్ అయిన అల్లు అర్జున్ మరో స్టార్ డైరెక్టర్ తో కూడా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఆ డైరెక్టర్ మరెవరో కాదు.. దురంధర్ మూవీ డైరెక్టర్ ఆదిత్య. ఆదిత్య తన కలల ప్రాజెక్టును ఏకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు వినిపించగా అల్లు అర్జున్ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఆదిత్య తెరకెక్కించినటువంటి దురంధర్ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇక దురంధర్-2 మార్చిలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో ఈ సినిమా రిలీజ్ అయిన అనంతరం అల్లు అర్జున్ తో చేయడంపై అధివారికంగా ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో అల్లు అర్జున్ నలుగురు స్టార్ డైరెక్టర్లతో సినిమా తీస్తున్నారు అంటే కచ్చితంగా ఒక్కో సినిమా వేరే లెవెల్ లో ఉండబోతుంది అంటూ ఫ్యాన్స్ సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read also : అన్ని నేనే చేస్తే ఇక మీరెందుకు.. పార్టీ నాయకులపై పవన్ కళ్యాణ్ సీరియస్?

Read also : ప్రజావాణిలో పిర్యాదులు బుట్ట దాఖలు చేసిన వారి పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button