Monday, February 23, 2026
Homeసినిమాఆరోజునే అల్లు అర్జున్ సినిమా టీజర్ విడుదల?

ఆరోజునే అల్లు అర్జున్ సినిమా టీజర్ విడుదల?

క్రైమ్ మిర్రర్,సినిమా న్యూస్:- తెలుగు సినిమా ఇండస్ట్రీని పుష్ప సినిమాతో ప్రపంచ దృష్టికి తీసుకెళ్లినటువంటి అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. పుష్ప సినిమాతో ట్రెండ్ సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తను నటిస్తున్న సినిమాతో మరిన్ని రికార్డులు కొల్లగొట్టే విధంగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తాజాగా అల్లు అర్జున్ మరియు అట్లీ కాంబినేషన్లో రాబోతున్నటువంటి మూవీ టీజర్ త్వరలోనే రానుంది. ఏప్రిల్ 8వ తేదీన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ టీజర్ ను విడుదల చేయాలి అని చిత్ర బృందం నిర్ణయించినట్లుగా సమాచారం. కాగా ఈ సినిమాలో దీపిక పదుకొనే, రష్మిక మందాన మరియు మృనాల ఠాకూర్ వంటి స్టార్ హీరోయిన్లు నటిస్తున్నట్లు కొన్ని సందర్భాల్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అల్లు అర్జున్ టీజర్ విడుదలపై ప్రతి ఒక్కరు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. అయితే ఈ సినిమా టీజర్ పై చిత్ర బృందం అధికారికంగా అయితే ఎటువంటి ప్రకటన చేయలేదు. పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ తమిళ స్టార్ డైరెక్టర్లతో ఒప్పందం చేసుకున్నారు. దీంతో అల్లు అర్జున్ భవిష్యత్తులో రాబోయే సినిమాలపై ఇప్పటి నుంచే ఫ్యాన్స్ లో ఎంతగానో ఆసక్తి నెలకొంది.

రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారం.. నాలుగు కు చేరిన మతుల సంఖ్య!

ఓటమికి కారణం ఇతడే.. లేదంటే కథ మరోలా ఉండేది?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments