తెలుగు ప్రముఖ హీరో అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ నేపథ్యంలో అల్లు అర్జున్ బంజారా హిల్స్ లో ఉన్నటువంటి తన స్వగృహంలో అరెస్ట్ అయ్యాడు. వైద్యపరీక్షలు నిర్వహించిన తరవాత పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరు పర్చగా 14 రోజులపాటూ రిమాండ్ విధించింది. దీంతో అల్లు అర్జున్ ని చంచల్ గూడ జైలుకు తరలించారు.
ఐతే శుక్రవారం రోజే అల్లు అర్జున్ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ బెయిల్ ఆర్డర్స్ అందడానికి లేట్ అయింది. దీంతో అల్లు అర్జున్ ఒకరోజు పాటూ చంచల్ గూడ జైలులో ఉన్నాడు. ఈ క్రమంలో జైలు అధికారులు అల్లు అర్జున్ కి ఖైదీ నంబర్ 7697 ని ఇచ్చారు. అలాగే మంజీరా బ్లాక్ లోని ప్రత్యేక బ్యారెక్ లో ఉంచినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ రాత్రి భోజనం చెయ్యకుండా నేలపైనే పడుకున్నాడట. అల్లు అర్జున్ కి ఇచ్చిన ఖైదీ నంబర్ 7697 నంబర్ గాట్ టాపిక్ గా మారింది.
ఈ నంబర్ ని కూడగా 11 సంఖ్య వస్తుంది. ఈ విషయాన్ని ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ పార్టీ గెలుపొందిన సీట్ల నంబర్ కి లింకు చేస్తున్నారు. అల్లు అర్జున్ ఈ ఎన్నికల్లో వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన శిల్ప రవిచంద్ర రెడ్డికి సపోర్ట్ చేస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. దీంతో కొందరు అల్లు అర్జున్ అరెస్ట్ లో కొందరు కుట్ర పూరిత రాజకీయాలు చేస్తున్నారని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు.