తెలుగు రాష్ట్రాల్లో సంచనలంగా మారిన అల్లు అర్జున్ కేసులో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. సంధ్య థియేటర్ ఘటనలో సంచలన వాస్తవాలు బయటికి వస్తున్నాయి. పుష్ప హీరో అల్లు అర్జున్ థియేటర్ లోపలికి రావడానికి 20 నిమిషాల ముందే సంధ్య థియేటర్ లోపల తొక్కిసలాట జరిగింది.ఆ తొక్కిసలాటలో రేవంతితో పాటు ఆమె కొడుకు శ్రీ తేజ్ స్పృహ తప్పి పడిపోయాడు.
సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం థియేటర్ లోపల తొక్కిసలాట జరగగా రాత్రి 9:16 గంటల సమయంలో స్పృహ తప్పి పడిపోయిన శ్రీ తేజ్ ను బయటకి తీసుకొచ్చారు కొందరు యువకులు. అవన్ని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. తొక్కిసలాట జరిగింది థియేటర్ లోపల కానీ బయట కాదు. పోలీసులు విడుదల చేసిన వీడియోలో 9:28 నుండి 9:34 సమయం వరకు ముషీరాబాద్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్నారు అల్లు అర్జున్. 9.36 నిమిషాల సమయంలో సంధ్య థియేటర్ కు వచ్చారు. అంటే అల్లు అర్జున్ థియేటర్ దగ్గరకు రావడానికి 20 నిమిషాల ముందే తొక్కిసలాట జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది.
ఓ అభిమాని తీసిన ఫోటోలో సైతం 9:33 సమయంలో థియేటర్ బయటే ఉన్నారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ రాకముందే థియేటర్ లోపల జరిగిన ఘటనకు అతడిని పోలీసులు బాధ్యుడిని చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక పోలీసులు శ్రీతేజ్ ను థియేటర్ నుంచి బయటికి తీసుకువస్తున్న వీడియోను రిలీజ్ చేసినా.. అందులో సమయం కనిపిచ్చే దగ్గర వేరే టైటిల్ తో కవర్ చేశారు. 9.16 నిమిషాలకు ఘటన జరిగింది కాబట్టి.. అది కనిపించకుండా కవర్ చేయడానికి ఇలా చేశారనే టాక్ వస్తోంది.