
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- ప్రముఖ నిర్మాత, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ హీరోయిన్ రష్మికను సరదాగా ఆట పట్టించారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన కొత్త మూవీ అయినటువంటి “ది గర్ల్ ఫ్రెండ్” ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో భాగంగా అల్లు అరవింద్ పాల్గొని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ రష్మికను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. రష్మిక లాంటి అమ్మాయి నాకుంటే ఎంత బాగుండో అని… ఇలాంటి కూతురు నాకుంటే బాగుండు అని అన్నారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే… ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ ను మోయగలిగే కెపాసిటీ కేవలం రష్మికకు మాత్రమే ఉంది అని స్పష్టం చేశారు.
Read also : ఎప్పటికైనా నిజామాబాద్ గడ్డలోనే కలిసిపోతా : కవిత
ఈ సినిమాలో రష్మిక చాలా బాగా యాక్టింగ్ చేసింది అని… ఈ సినిమా నటనకు ది బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని తెలిపారు. తనను ఎప్పుడు చూసినా కూడా… నాకు కూడా ఇలాంటి కూతురు ఉండుంటే చాలా బాగుండేది అని మరోసారి అన్నారు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూనే చివరిలో… ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండను కూడా పిలుద్దామని నవ్వుతూ సరదాగా మాట్లాడారు. అల్లు అరవింద్ సరదాగా ఈ మాటలు అనడంతో అక్కడున్న వారందరూ కూడా ఒక్కసారిగా కేకలు వేయడం మొదలుపెట్టారు. తప్పకుండా విజయ్ దేవరకొండ ను పిలుస్తానని.. అల్లు అరవింద్ నవ్వుతూనే మాట్లాడారు. ఈ సందర్భంలో వెనకే ఉన్నటువంటి రష్మిక కూడా నవ్వుతూ వెనక్కి తిరిగారు. రష్మిక, దేవరకొండ ఈ మధ్యనే అతి కొద్ది మంది బంధువుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. బహుశా ఇందుకేనేమో అల్లు అరవింద్ కూడా కాస్త సరదాగా విజయ్ దేవరకొండ ను పిలుద్దామని సంభాషించారు.
Read also : బ్రేకింగ్ న్యూస్… స్కూళ్లకు సెలవులు ప్రకటించిన అధికారులు?





