Homeతెలంగాణస‌రిత‌ పై చేసిన ఆరోప‌ణ‌లు పూర్తిగా అవాస్త‌వం...!

స‌రిత‌ పై చేసిన ఆరోప‌ణ‌లు పూర్తిగా అవాస్త‌వం…!

స‌రిత‌ పై చేసిన ఆరోప‌ణ‌లు అవాస్త‌వం…

ప‌త్రిక క‌థ‌నాల‌తో కావాల‌నే నన్ను బదనాం చేసిండ్రు

నాపై కావాల‌నే క‌క్ష పూరితంగానే వ‌దంతులు సృషిస్తున్న‌రు

సంఘంలోని కొంత మంది కావాల‌నే ఆరోప‌ణ‌లు చేస్తున్న‌రు

అధికారుల స‌మ‌క్షంలో నిజాల‌ను నిగ్గు తేల్చారు

అస‌త్య ఆరోప‌ణ‌లు ఎవ‌రు న‌మ్మ‌వ‌ద్దు – విఓఏ స‌రిత‌

క్రైమ్ మిర్ర‌ర్ ప్రతినిధి, వేములపల్లి: గ‌త కొన్ని రోజులుగా నల్గొండ జిల్లా వేముల‌ప‌ల్లి మండ‌లం ప‌రిధిలోని ల‌క్ష్మీదేవిగూడెం వీఓఏ ముత్యాల స‌రిత‌ పై ఏదో విధంగా ఆమె అవినీతికి పాల్ప‌డింద‌ని ఆమెపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప‌లు పత్రిక‌ల్లో క‌థ‌నాలు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఐకేపీ సెంట‌ర్‌ల‌లో అవ‌క‌త‌వ‌క‌ల‌ పై అవినీతికి పాల్ప‌డింద‌ని స‌రిత‌ పై వ‌స్తున్న క‌థ‌నాలు జిల్లా వ్యాప్తంగా దావ‌ణంలా మారాయి. దీని పై జిల్లా అధికారులు బుధ‌వారం ల‌క్ష్మిదేవిగూడెంకు వ‌చ్చి సంఘం స‌భ్యుల ఆధ్వ‌ర్యంలో విచార‌ణ చేప‌ట్టారు.

స‌రిత‌ పై చేసిన ఆరోప‌ణ‌లు అవాస్త‌వం...
స‌రిత‌పై చేసిన ఆరోప‌ణ‌లు అవాస్త‌వం…

ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌లు పాల్ప‌డ‌లేదు…

సంఘం స‌భ్యుల ఫిర్యాదులు, ఆరోప‌ణ‌ల‌కు జిల్లా యంత్రాంగం స్పందించి. ఈ విష‌యం పై జిల్లా అధికారి పీడీ శేఖ‌ర్ రెడ్డి, ఆదేశానుసారం మండ‌ల మ‌హిళా సంఘం అధికారులు, ఏపీఎం జాన‌కి, సీసీ గోపి, గ్రామ స‌ర్పంచ్ భ‌ర‌త్‌ లు విచార‌ణ చేప‌ట్టారు. దీంతో స‌రిత‌పై చేసిన ఆరోప‌ణ‌లు నిజం కావ‌ని నిరూపిత‌మ‌య్యాయి. దీంతో సంఘం స‌భ్యుల నుంచే కొత్త వివోఏ ను ఎన్నుకునేందుకు ఓటింగ్ ప‌ద్దతి నిర్వ‌హించ‌గా మ‌ళ్లీ ఆమెను 22 మంది స‌భ్యులు ఓటు వేసి ఆమెను మ‌ళ్లీ ఎన్న‌కున్న‌ట్లు గ్రామ‌స్తులు పేర్కొన్నారు. కాగా గ్రామంలో 35 సంఘాలు ఉండ‌గా అందులో 22 సంఘాలు ప్ర‌స్తుతం సంపూర్ణంగా న‌డుస్తున్నాయి. కాగా ఇందులో 17 మంది స‌భ్యులు ఆమె వైపు నిల‌బ‌డ‌డంతో మ‌ళ్లీ ఆమెను ఎన్న‌కున్నారని గ్రామ‌స్తులు తెలిపారు.కావాల‌నే నాపై ఆరోప‌ణ‌లు చేసి ఇబ్బందుల‌కు గురి చేసిండ్రు…

స‌రిత‌పై చేసిన ఆరోప‌ణ‌లు అవాస్త‌వం...
స‌రిత‌పై చేసిన ఆరోప‌ణ‌లు అవాస్త‌వం…

నేను అంటే గిట్ట‌ని వారే న‌న్ను బాధ‌పెట్టిండ్రు… విఓఏ స‌రిత‌

గ‌త సంవ‌త్స‌ర కాలంగా సంఘం లోని కొంద‌రు స‌భ్యులు కావాలనే నా పై క‌క్ష పెంచుకొని అనేక ఇబ్బందుల‌కు గురి చేసిండ్రు. క‌లెక్ట‌ర్‌కు, పంచాయ‌తీ అధికారుల‌కు ఫిర్యాదులు, ఏదో విధంగా నాపై ప‌త్రిక‌ల్లో క‌థ‌నాలు వేయించి అనేక విధాలుగా బ‌ద్‌నాం చేసిండ్రు. నేను ఈ వదంతుల వ‌ల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై జిల్లా స్థాయి అధికారుల స‌మ‌క్షంలోనే విచార‌ణ చేప‌ట్టి సంఘం స‌భ్యుల‌నే న‌న్ను ఎన్నుకోవ‌డం ఎలాంటి అవినీతికి పాల్ప‌డ‌లేద‌ని నిరూప‌ణ కావ‌డం నా నిజాయితికి నిద‌ర్శ‌నం. తోటి సంఘం స‌భ్యులే కొంద‌రు కావాల‌ని నాపై లేని పోని ఆరోప‌ణ‌లు చేయ‌డం బాధ అనిపించింది. వీరు చేసిన పుకార్లు, వ‌దంతులు అబద్ద‌మ‌ని అధికారుల మ‌ధ్య‌నే తేల్చారు. ఇలాంటి వదంతుల‌ను, పుకార్ల‌ను ఎవ‌రు న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments