
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- సోషల్ మీడియాలో గత కొన్ని నెలల కిందట నుంచి హీరో విజయ్ దేవరకొండ అలాగే హీరోయిన్ రష్మిక మందన ఇద్దరు కూడా డేటింగ్ లో ఉన్నారు అంటూ.. తాజాగా వారిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అని పెద్ద ఎత్తున వార్తలు అయితే వచ్చాయి. అయితే తాజాగా అవన్నీ కూడా నిజమే అని.. త్వరలోనే విజయ్ ను పెళ్లి చేసుకుంటానని హీరోయిన్ రష్మిక ఒక క్లారిటీ అయితే ఇచ్చారు.. తాజాగా జరిగిన ఒక పాడ్ కాస్ట్ లో రష్మిక మందన స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ పాడ్ కాస్ట్ లో భాగంగా ఒక అభిమాని.. మీరు డేట్ ఎవరితో చేస్తారు అలాగే ఎవరిని పెళ్లి చేసుకుంటారు అని ప్రశ్నించగా… దానికి సమాధానంగా.. జపనీస్ వ్యక్తి నరోటాతో డేటింగ్ చేస్తాను అని.. పెళ్లి మాత్రం విజయ్ ను చేసుకుంటాను అని రష్మిక మందన ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చారు.
Read also : నేను కాదు.. మీరే బ్యాడ్ బ్రదర్స్.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
ఈ సమాధానంతో వీరిద్దరి మధ్య వివాహం కన్ఫర్మ్ అయిందని.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. కాగా ఇటీవల వీరు అతి కొద్ది మంది బంధువులు అలాగే మిత్రుల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకోగా.. ఆ విషయాన్ని మాత్రం బయటకు వీరిద్దరూ ఎక్కడా కూడా చెప్పలేదు. దీంతో ఏదైనా సినిమాలో భాగంగా ఇలా చేశారా?.. లేక కావాలని దాచి పెట్టారా?.. అని చాలామంది అభిమానులకు కూడా ఈ విషయం పై అనుమానంగా ఉన్నారు. ఏది ఏమైనా ఎట్టకేలకు ఈ విషయం బయటపడడంతో ఒకవైపు రష్మిక అభిమానులు మరోవైపు విజయ్ దేవరకొండ అభిమానులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కాగా వీరిద్దరూ కలిసి ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.
Read also : ఏంటి తమాషాలా?.. షమీ భార్యకు ఇచ్చి పడేసిన నెటిజనులు!





