క్రైమ్ మిర్రర్, తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాలలో ఉపయోగించే నెయ్యి గురించి సరికొత్త నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఉన్న ప్రతి దేవాలయంలోనూ ఇకపై తయారు చేసే ఏ ప్రసాదంలోనైనా సరే తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి విజయ డైరీ నెయ్యి మాత్రమే వాడాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కాగా తాజాగా భద్రాద్రి ఆలయ అధికారులు ఒక ప్రైవేట్ డైరీ తో ఒప్పందం చేసుకోగా ఆలయ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే కేవలం ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి విజయ డైరీ నెయ్యి మాత్రమే వాడాలని తెలిపింది.
రెండు ఎకరాలతో… దేశంలోనే రిచెస్ట్ సీఎం అయిపోతారా?… రోజా ట్వీట్
ఇప్పటినుండి అన్ని ఆలయాలలో నెయ్యి సరఫరా పై ప్రత్యేక నివేదిక ఇవ్వాలని కోరారు. ఇప్పటికే ఆలయాలు ఇతర ప్రైవేట్ డైరీలతో ఒప్పందాలు చేసుకుంటే వెంటనే వాటి అన్నిటిని కూడా రద్దు చేసుకోవాలని తెలిపింది. కాగా యాదాద్రి ఆలయంలో ఇప్పటివరకు మదర్ డైరీ నెయ్యిని ఉపయోగిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే యాదాద్రి ఆలయం కు ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది మార్చి నెల వరకు మదర్ డైరీ నెయ్యిని ఉపయోగించుకోవచ్చు అంటూ అనుమతులు ఇచ్చింది.
నలుగురికి ఖేల్‌రత్న, 32 మందికి అర్జున.. క్రీడా పురస్కారాలను ప్రకటించింన కేంద్రప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుమల లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుమల లడ్డు గురించి వివాదాలు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. లడ్డులో కల్తీ నెయ్యి ఉపయోగించారంటూ ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీ అయినటువంటి కూటమి ప్రభుత్వం జగన్ ప్రభుత్వం పై మండిపడ్డ విషయం మనందరికీ తెలిసిందే. కాగా ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి విజయ డైరీ నెయ్యిని అన్నీ దేవాలయాల్లో ఉపయోగించమని చెప్పడం విశేషం.