
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :-
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లేటువంటి భక్తులకు అలర్ట్. కార్తీక మాసంలో చివరి సోమవారం నాడున అనగా నిన్నటి నుంచి కేరళలోని శబరిమలలో అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకుంది. దర్శనాలు ప్రారంభం కావడంతో వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఒకేసారి కొన్ని వేల మంది భక్తులు తరలివస్తుండడంతో దాదాపు కిలోమీటర్ కు పైగా క్యూ లో అయ్యప్ప స్వాములు వేచి ఉండాల్సి వస్తుంది. సరైన సౌకర్యాలు లేక భక్తులు కూడా ఈ క్యూ లైన్ లలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని.. తద్వారా చిన్నపిల్లలతో వెళ్లేటువంటి అయ్యప్ప స్వాములు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అధికారులు సూచించారు. మకర విలక్కు సీజన్లో మండల పూజ కోసం ప్రధాన పూజారీ అయినటువంటి మహేష్ మెహనార్ సమక్షంలో అరుణ్ కుమార్ నంబూద్రి ఆలయం ద్వారాలను తెరిచి భక్తులకు దర్శనం కల్పించారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి భక్తులకు దర్శనం అనుమతిస్తారు అని తెలిపారు. ఈరోజు నుంచి డిసెంబర్ 27వ తేదీ వరకు ఆలయం తెరుచుకుని ఉంటుంది… ఆ తరువాత మూసివేసి మళ్లీ డిసెంబర్ 30వ తేదీన తెరిచి జనవరి 20వ తేదీ వరకు కూడా భక్తులకు దర్శనాలకు అనుమతి ఇస్తారు అని అధికారులు వెల్లడించారు. మరోవైపు కేరళలోని ఆరోగ్యశాఖ అధికారులు బ్రెయిన్ ఫీవర్ కారణంగా శబరిమలకు వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. నదులలో పుణ్య స్నానాలు చేసేటువంటి అయ్యప్ప స్వాములు జ్వరాల బారిన పడకుండా జాగ్రత్తలను తీసుకోవాలని కోరారు.
Read also : మీ వల్ల మాకు ఎంతో నష్టం.. ఐ బొమ్మ రవి అరెస్టు పై స్పందించిన చిరంజీవి!
Read also : Upendra Dwivedi: ఆపరేషన్ సిందూర్ జస్ట్ ట్రైలర్… ఆర్మీ చీఫ్ షాకింగ్ కామెంట్స్!





