
క్రైమ్ మిర్రర్, ఆంధ్ర ప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థులకు ఈనెల 25వ తేదీన అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే తాజాగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన కొత్త టీచర్లకు కొన్ని కీలక సూచనలు చేసింది. అక్టోబర్ 3 నుంచి 10 వ తేదీ వరకు కొత్తగా జాబ్ పొందినటువంటి టీచర్లకు ట్రైనింగ్ సెషన్ నిర్వహించి వెంటనే పోస్టింగ్ అనేది ఇవ్వనున్నామని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇక ఆ వెంటనే 13వ తేదీ నుంచి టీచర్లుగా విధులకు హాజరు కావాలని సూచించారు. అయితే ఏపీ ప్రభుత్వ అధికారులు విడుదల చేసినటువంటి మెగా డీఎస్సీ తుది జాబితా పై ఎవరికైనా ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా కూడా అక్టోబర్ 25వ తేదీ లోపు తెలియజేయవచ్చని అధికారులు చెప్పుకొచ్చారు. ఈ అభ్యంతరాలన్నిటినీ కూడా జిల్లా, జోనల్ మరియు రాష్ట్రస్థాయి కమిటీలు పరిష్కరిస్తాయని చెప్పుకొచ్చారు.
Read also : ఏకాత్మ మానవవాద సిద్ధాంతకారుడు దీన్ దయాళ్
కాగా ఎంతో ఆశగా ఎదురు చూసిన కొన్ని వేల మంది నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వ రూపంలో ప్రభుత్వ ఉద్యోగాలు అయితే చాలా మంది పొందారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే మొదటిగా డీఎస్సీ నోటిఫికేషన్ పైన సంతకం చేస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన ప్రకారం నేడు చంద్రబాబు నాయుడు చేసి చూపించారు. దాదాపు 16 వేల మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. దీనిపై ఇప్పటికే నిరుద్యోగులు ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read also : స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహన అవసరం – జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ