
క్రైమ్ మిర్రర్,సినిమా న్యూస్:- బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చినటువంటి అఖండ-2 థియేటర్లలో ప్రతి ఒక్కరిని కూడా అలరిస్తుంది. ఎన్నో అడ్డంకులు వచ్చినా కూడా నేడు అఖండ 2 సినిమాను థియేటర్లలో విడుదల చేశారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే దైవం పై పడిన నిందను తొలగించడం, హిందూ ధర్మ పరిరక్షణకు హీరో అఖండ (బాలకృష్ణ) ఏం చేశారనేదే ఈ సినిమా పూర్తి కథ. ఇక హీరోగా బాలకృష్ణ తన నటనతో విశ్వరూపం చూపించారు. ఇక ఈ సినిమా ఫ్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే సినిమాకే హైలెట్గా నిలుస్తుంది.
Read also :ముగిసిన మొదటి విడత పంచాయతీ ఎన్నికలు .. ఇప్పుడు రెండో విడత పై ఫోకస్?
ఇక తమన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలాగే యాక్షన్ సీన్లు ప్రతి ఒక్కటి అందర్నీ ఆకట్టుకుంటాయి. మన భారతదేశ భక్తి అలాగే హిందువుల సనాతన ధర్మంపై డైలాగులు ఎవరు రాశారో కానీ అవి ప్రతి ఒక్క హిందువును మెప్పిస్తాయి అనడంలో సందేహం లేదు. మన దేశంతో దైవానికి లింక్ చేసి హైందవ ధర్మాన్ని చాటి చెప్పేలా డైరెక్టర్ బోయపాటి శ్రీను ఒక అద్భుతమైన కథను అల్లారు. ఇక ఇవన్నీ సినిమాకు ప్లస్ పాయింట్లు కాగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని సీన్లు నెగిటివ్ గా కూడా ఉన్నాయి. ఈ సినిమాలో కొన్ని సందర్భాలలో కొన్ని సీన్లు చాలా సాగదీతగా అనిపిస్తాయి. ఇక ఫస్ట్ ఆఫ్ అయితే చాలా చోట్ల ట్రిమ్ చేసుంటే బాగుండు అని అనిపిస్తుంది. అంతేకాకుండా అఖండ సినిమాలో కన్నా ఈ అఖండ 2 సినిమాలో విలనిజం సరిగా లేకపోవడం ఈ సినిమాకు మైనస్.
రేటింగ్ :- 3/5
Read also : క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. 100 రూపాయలకే టికెట్లు!





