తెలంగాణ

శ్రీ సీతారాముల సేవలో ఐతగోని యాదగిరి గౌడ్..

మర్రిగూడ, (క్రైమ్ మిర్రర్): ఆత్మ సంతృప్తి, జీవిత ఆనందం కేవలం భగవంతుని ఆరాధనతోనే కలుగుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు..తాను పుట్టిన ధర్మ సంక్షేమం కోసం మనుషులు ఎంతో కొంత భగవంతుడి సేవ కోసం ఉపయోగించాలి.. అలాంటి సేవా కార్యక్రమాన్నే ఇందూర్తి గ్రామానికి చెందిన ఐతగోని యాదగిరి చేశారు.. శ్రీరామ నవమి సందర్బంగా సీతారాములు, లక్ష్మణుడు, హనుమంతుడి విగ్రహాలను ఆలయానికి వితరణ చెయ్యడమే కాకుండా, ఆంజనేయ స్వామి ఆలయ పైకప్పును నిర్మించారు.

భగవంతుడిపై యాదగిరి గౌడ్ కి ఉన్న భక్తి, ప్రజల శ్రేయస్సు కోసం ఆయన చేసిన సేవా దృక్పదాన్ని ప్రజలు కొనియాడారు.. తాను పుట్టిన గ్రామపరిధి ప్రజలకు తన వంతు ఏదో ఒక రకమైన సేవా కార్యక్రమాలు యాదగిరి గౌడ్ చేస్తున్నాడు. ఆయన చేసిన సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ, నాయకులు ఆయనను దైవ సన్నిధిలో సన్మానించారు..


Also Read : కల్తీ మద్యం గుట్టు రట్టు…కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్.


అనంతరం కుంభం మదన్ రెడ్డి అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు నాగబండి నర్సింహా, ఐతగోని రఘు, తాజా మాజీ ఎంపిటిసి ఊరిపక్క సరితనాగేష్, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు అశోక్ గౌడ్, బిఆర్ఎస్ నాయకులు చెరుకు లింగం గౌడ్, గణేష్ గౌడ్, వనం యాదయ్య, పులి నర్సింహ, సీపీఎం నాయకులు ఎర్పుల యాదయ్య, దొడ్డి శ్రీను, శివ గౌడ్, యాసినా గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..

ఇవి కూడా చదవండి .. 

  1. వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు.. తెలంగాణలో బిగ్ ఎలర్ట్

  2. రాజాసింగ్ జై శ్రీరామ్ శోభాయాత్ర.. పాతబస్తీలో హై టెన్షన్

  3. తెలంగాణ లేటెస్ట్ సర్వే.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..!

  4. సన్నబియ్యం పేదవాడి ఆత్మ గౌరవం..మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  5. జూలై తర్వాతే సర్పంచ్ ఎన్నికలు!

Back to top button