
క్రైమ్ మిర్రర్ / వికారాబాద్ జిల్లా :-జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల కురిసిన వడగండ్ల వాన రైతుల ఆశలపై నీళ్లు చల్లింది.పంటలు దెబ్బతిన్న రైతులు దిక్కుతోచని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వికారాబాద్ జిల్లాలో నవాబ్ పేట్,మోమిన్ పేట్,మర్పల్లి,పూడూర్ మొదలైన మండలాల్లో కురవడంతో పలు రకాల పంటలు దెబ్బతిన్నాయి.వ్యవసాయ అధికారులు సోమవారం ఆయా మండలాల వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలన చేసి ఇప్పటివరకు 158 ఎకరాలకు సంబంధించి మొక్కజొన్న,జొన్న, కూరగాయలు పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమిక అంచనా వేశారు.నవాబ్ పేట్ మండలంలో ఎల్లకొండ ముబారక్ పూర్,చిట్టిగిద్ద,ఆర్కతల,మీనేపల్లి కలాన్ గ్రామాలల్లో వర్షానికి దెబ్బతిన్న పంటలను మండల వ్యవసాయ అధికారి జ్యోతి క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్ట వివరాలను నమోదు చేశారు.రైతులు పంట చేతికొచ్చే సమయంలో వర్షానికి దెబ్బతిని తీవ్ర నష్టం మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
నవాబ్ పేట మండలంలో ఆర్కతల ఎల్లకొండ,మీనేపల్లి కలాన్, ముబారక్ పూర్ గ్రామాల్లో మొక్కజొన్న 3 ఎకరాలు,జొన్న 18 ఎకరాలు, కూరగాయలు 28 ఎకరాల వరకు దెబ్బతిన్నాయని అన్నారు.పంటలు నష్టపోయిన రైతుల వివరాలను నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని ప్రభుత్వం నుండి వచ్చే ఆర్థిక సాయం రైతులకు అందేలా కృషి చేస్తామని జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి తెలిపారు.
LRSపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన…
ప్రాణాపాయ స్థితిలో బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్!.. పరిస్థితి విషమం?