Monday, March 23, 2026
Homeక్రీడలుఆటకు వయసుతో సంబంధం లేదు.. రోహిత్,కోహ్లీ ఆడాలి : MS ధోని

ఆటకు వయసుతో సంబంధం లేదు.. రోహిత్,కోహ్లీ ఆడాలి : MS ధోని

క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- భారత దిగ్గజా ఆటగాడు, మాజీ కెప్టెన్ Ms ధోని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో భాగంగా రోహిత్ మరియు విరాట్ కోహ్లీల భవిష్యత్తు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఇప్పటినుంచి రోహిత్ మరియు విరాట్ కోహ్లీలు ఆడుతారా లేదా అనే ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా ఎన్నో సందర్భాలలో వస్తున్న వేల ఎమ్మెస్ ధోని ఈ విషయంపై స్పందించారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మంచి ఆటగాళ్లు. వారు 2027లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ ఎందుకు ఆడకూడదు అని ప్రశ్నించారు. వయసును బట్టి ఆటగాళ్లను అంచనా వేయకూడదు అని ట్రోల్స్ చేసే వారికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. క్రికెట్ లో ఫిట్నెస్, ప్రదర్శన మీద ఆధారపడి ఉంటుంది కానీ.. వయసుతో సంబంధం ఉండదు అని తేల్చి చెప్పారు. ఇక ఈ రోజుల్లో 30 సంవత్సరాలు దాటితే వారు క్రికెట్ కు అనర్హులుగా భావిస్తూ ఉన్నారు అని.. క్రికెట్లో ఫిట్ గా ఉంటే రాణిస్తున్నంత కాలం జట్టులో కొనసాగాలి అని చెప్పుకొచ్చారు. రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీలు మాత్రమే కాకుండా టీమిండియా అంతర్జాతీయ జట్టులో ఉన్నటువంటి సీనియర్లకు ఎమ్మెస్ ధోని మద్దతుగా నిలిచారు. కచ్చితంగా 2027 వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా ఆడుతారు అని ఒక విధంగా ఎంఎస్ ధోని హింట్ ఇచ్చారు.

Read also : Triple Suicide: ఆన్ లైన్ గేమ్స్ కు బానిసలై.. ముగ్గురు అక్కా చెల్లెళ్లు ఆత్మహత్య!

Read also : Yumnam Khemchand: మణిపూర్ సీఎంగా ఖేమ్‌ చంద్, ప్రమాణం చేయించిన గవర్నర్ భల్లా!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments