
ఏపీలో లిక్కర్ స్కామ్ ప్రకంపనలు మొదలయ్యాయి. వైసీపీ నేతలు, మాజీ నేతలు సిట్ విచారణకు క్యూ కడుతున్నారు. కసిరెడ్డితో మొదలైన తీగ… ప్రస్తుతం మిథున్‌రెడ్డి వరకు వచ్చింది. ఆ తర్వాత… ఎవరి వరకు వెళ్తుంది…? అసలు ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగిందా…? జరిగితే…. దాని వెనకున్న బిగ్‌బాస్ ఎవరు…? సిట్ విచారణలో విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి ఏం చెప్పారు…?
ఏపీ లిక్కర్ స్కామ్‌లో బిగ్‌బాస్ ఎవరు..? ఇది తేల్చే పనిలో ఉంది సిట్ బృందం. ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తోంది. స్కామ్ ఎలా జరిగింది…? పాత్రధారులు ఎవరు..? సూత్రధారులు ఎవరు…? కింగమేకర్ ఎవరు..? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే పనిలో ఉన్నారు సిట్ అధికారులు. ఇప్పటికే విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు. మిథున్‌రెడ్డి వంతు కూడా అయ్యింది. విజయసాయిరెడ్డిని, మిథున్‌రెడ్డిని… మళ్లీ విచారణకు పిలుస్తారా…? అంటే అవసరమైతే పిలవచ్చు. వీరిద్దరి తర్వాత… నెక్ట్స్ ఎవరు…? సిట్ అధికారులు ఎవరికి నోటీసులు ఇవ్వబోతున్నారు…? అన్న చర్చ కూడా జరుగుతోంది.
Also Read : కూటమికే విశాఖ మేయర్ పీఠం.. ఎన్నికకు ముందే వైసీపీ అవుట్
ఏపీలో ఢిల్లీకి మించి లిక్కర్ స్కామ్ జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులే బయటపెట్టారు. విచారణకు ఆదేశించాలని కేంద్రం అనుమతి కూడా కోరారు. ఇప్పుడు రాష్ట్రస్థాయిలో సిట్ ప్రశ్నిస్తోంది. సిట్ విచారణలో విజయసాయిరెడ్డి కీలక విషయాలు చెప్పారు. హైదరాబాద్‌లోని తన ఇంట్లో మొదటి సమావేశం, విజయవాడలో తాను ఉంటున్న విల్లాలో రెండో సమావేశం జరిగిందని.. రెండు సమావేశాల్లో లిక్కర్ పాలసీ గురించి చర్చించామన్నారు. ఈ సమావేశంలో కసిరెడ్డి, వాసుదేవరెడ్డి, మిథున్‌రెడ్డి, సత్యప్రసాద్, సజ్జల శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారని చెప్పారు. ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయ్‌రెడ్డి సమావేశంలో ఉన్నారో లేదో తనకు గుర్తులేదన్నారు విజయసాయిరెడ్డి. రాజ్ కసిరెడ్డి వసూలు చేసిన కిక్‌బ్యాక్స్ (ముడుపులు) గురించి కూడా తెలీదన్నారు.
Also Read : ఎకరం భూమి 99 పైసలే!… ప్రముఖ ఐటీ కంపెనీకి కట్టుబెట్టిన ఏపీ ప్రభుత్వం.
కసిరెడ్డి, మిథున్‌రెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి తన దగ్గర వచ్చి వ్యాపారం కోసం 100 కోట్లు అప్పు ఇప్పించమంటే… అరబిందో శరత్‌చంద్రారెడ్డికి చెప్పి ఇప్పించానన్నారు. అడాక్ కంపెనీకి 60 కోట్ల రూపాయలు, డీకార్ట్ కంపెనీకి 40 కోట్ల రూపాయలు 12 శాతం వడ్డీకి ఇప్పించానన్నారు. అయితే ఇందులో 60 కోట్ల రూపాయలు రీఫండ్ చేశారు. 40 కోట్లలో అసలు ఇచ్చారని.. వడ్డీ ఇంకా ఇవ్వలేదన్నారు. ఈ డబ్బును ఎందుకు ఉపయోగించుకున్నారు… ఎలా రీఫండ్ చేశారు అన్నది కూడా తనకు తెలీదన్నారు విజయసాయిరెడ్డి. మొదటి మూడు నెలల తర్వాత… అసలు లిక్కర్ పాలసీ విషయంలో తాను జోక్యం చేసుకోలేదన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే నెంబర్-2 నుంచి నెంబర్-2000కు పడిపోయానన్నారు. కసిరెడ్డిని పార్టీ పెద్దలకు తానే పరిచయం చేశారని… అందరినీ మోసం చేశాడని అన్నారు విజయసాయిరెడ్డి. లిక్కర్ పాలసీలో స్కామ్ జరిగిందా…? జరిగితే ఎలా జరిగింది…? ఇందులో ఎవరెవరు ఉన్నారు…? బిగ్‌బాస్ ఎవరు…? ఇవన్నీ… కసిరెడ్డికే తెలుసని.. ఆయన్ను పట్టుకుంటే అన్ని విషయాలు బయటపడతాయన్నారు విజయసాయిరెడ్డి.
Also Read : మోడీ అయినా డోంట్ కేర్ అంటున్న జగన్ – వక్ఫ్ చట్టంపై కేంద్రంతో ‘ఢీ’
మిథున్‌రెడ్డిని కూడా ఇలాంటి ప్రశ్నలే వేసింది సిట్. న్యాయవాది సమక్షంలో ఆయన్ను ప్రశ్నించారు. రాజ్ కసిరెడ్డి, అవినాష్‌రెడ్డి, చాణక్యరాజ్‌తో మద్యం పాలసీపై ఎందుకు చర్చించాల్సి వచ్చిందని ఆరా తీశారు. ప్రభుత్వానికి సంబంధించిన లిక్కర్ పాలసీపై ప్రైవేట్ వ్యక్తులతో చర్చించాల్సిన అవసరం ఏమొచ్చిందని క్వశ్చన్ చేశారు. హైదరాబాద్, విజయవాడలో జరిగిన సమావేశాల్లో ఏం చర్చించారని కూడా అడిగారు. విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి తర్వాత…. నెక్ట్స్ ఎవరు..? సిట్ ఎవరికి నోటీసులు ఇవ్వొచ్చు..? అనేది ఉత్కంఠగా మారింది.
ఇవి కూడా చదవండి ..
-
సూర్యాపేటలో ఫేక్ హాస్పిటల్.. డాక్టర్ పై ఫోర్జరీ కేసు
-
నిండు గర్భిణి.. కొన్ని గంటల్లో పుట్టబోయే బిడ్డ – అబ్బా.. ఎంత దారుణంగా చంపాడో..!
-
అమెరికా యూనివర్శిటీలో కాలులు.. రంగంలోకి డొనాల్డ్ ట్రంప్
-
సీఎం రేవంత్ రెడ్డికి గండం!సుప్రీంకోర్టుకు సీఈసీ సంచలన రిపోర్ట్
-
ఏపీలో లిక్కర్ స్కామ్ – హైదరాబాద్‌లో హడావుడి – కసిరెడ్డి నుంచి దారి జగన్ వైపుకా..!