పదేళ్లు పాలించి పదుల సార్లు ఇదిగో అదిగో అన్నారు : మండల కాంగ్రెస్ పార్టీ

ఆత్మకూరు,క్రైమ్ మిర్రర్:- యాదాద్రి భువనగిరి జిల్లా,ఆత్మకూరు మండలం గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో సెంట్రల్ లైటింగుతో పాటు డబుల్ రోడ్డు ఇదిగో వచ్చే అదిగో వచ్చే అని పదుల సార్లు పలు వార్త పత్రికలలో రాతలు రాయించుకొని ఇప్పుడు మేమే రోడ్డు వేయిస్తున్నట్లు, కలెక్టర్ నిధులతో వేయిస్తున్నట్లు వాట్సాప్ లలో మెసేజ్ లు,పలు వార్తా పత్రికలలొ వార్తలు రాయించుకోవడం సిగ్గు చేటు , కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య సహకారంతో గత సంవత్సరం 2025 జనవరి లోనే 175 లక్షల నిధులతో రోడ్డు పనులను ప్రారంభించుకోవడం జరిగింది. అయితే రోడ్డు పనులలొ భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ప్రస్తుత సర్పంచ్ బీసు ధనలక్ష్మి చందర్ గౌడ్ ఇంటి వద్దకు రోడ్డుపై వర్షం నీళ్ళు నిలుస్తాయని అందుకోసం సీసీ వేయాలని అధికారుల సూచన మేరకు ఎస్టిమేషన్ పెంచుతూ సీసీ రోడ్డు కోసం అదనంగా డిఎంఆర్ఎఫ్ నిధుల ద్వారా మరో 80 లక్షల రూపాయల నిధులను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సహకారంతో మంజూరి ఇప్పించడం జరిగింది.

లారీ కిందపడి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి

దానికి మేమే నిధులు తెప్పించి రోడ్డు వేయిస్తున్నట్లు,ఆలేరు ఎమ్మెల్యే దగ్గరికి మరియు జిల్లా కలెక్టర్ దగ్గరికి బిఆర్ఎస్ నాయకులు వెళ్లినట్లుగా తామే నిధులు తెచ్చినట్లుగా మేమే రోడ్డు ప్రారంభిస్తున్నట్లు ఫోటోలు పెట్టి తప్పుడు మెసేజ్ లు వార్తలతో జనాలను తప్పు తోవ పట్టించడం సరైనది కాదని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాస లక్ష్మా రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దసాని సిద్దులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి బాషబోయిన పాపయ్య యాదవ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కల్వకుంట్ల ఉపేందర్ రెడ్డి,మాజీ ప్యాక్స్ చైర్మన్ జిల్లాల శేఖర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోతగాని మల్లేశం గౌడ్,మాజీ ప్యాక్స్ డైరెక్టర్ నోముల వెంకట్ రెడ్డి, మండల మత్స్య సహకార సంఘం అధ్యక్షులు ఎద్దు వెంకటేశ్వర్లు, మాజి దేవస్థాన చైర్మన్ దొంతరబోయిన భాస్కర్,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చిత్తర్ల అనిల్, నాయకులు కొమిరెల్లి నర్సిరెడ్డి,సుంకరి నిరంజన్,బెజ్జరబొయిన సాయి,తదితరులు పాల్గొన్నారు.

Amit Shah: మార్చి 31 కల్లా నక్సల్స్‌ రహిత దేశంగా భారత్‌.. అమిత్‌ షా కీలక ప్రకటన!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button