
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు బీసీల 42% రిజర్వేషన్ల కారణంగా నిలిచిపోయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించిన తర్వాత దాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వస్తాయా లేదా అనే విషయం ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠంగా మిగిలిపోయింది. అసలు ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేస్తుంది?.. అనేది కూడా చాలా ఆసక్తిగా మారింది. ఇలాంటి తరుణంలోనే బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించాకే స్థానిక సంస్థల ఎన్నికలలో ముందుకు వెళ్లాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇక రేపు జరగబోయేటువంటి రాష్ట్ర బంద్ కు తెలంగాణ భవన్ నుంచి ర్యాలీగా వెళ్లి పాల్గొంటామని తలసాని స్పష్టం చేశారు. రేపు బీసీ సంఘాలు మరియు వివిధ పార్టీ నాయకుల సమక్షంలో రాష్ట్రవ్యాప్తంగా బంద్ జరుగుతుందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది. ఇప్పటికే ఒక్క మెడికల్ షాపులు తప్ప మిగతా అన్ని దుకాణాలను కూడా మూసివేయాలని… అందుకు ఆయా షాపు యజమానులు కూడా సరే అన్నట్లు తెలుస్తుంది. మరి రేపు రాష్ట్రవ్యాప్తంగా జరగబోయేటువంటి బంద్ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయా అనేది వేచి చూడాల్సిందే.
Read also : 15 సంవత్సరాల తర్వాత తెరపైకి జనగణన..?
Read also : నటులలో దేవుడు మహేష్ బాబే.. 5000 కు చేరిన ఉచిత గుండె ఆపరేషన్లు