
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- సింగల్ విండో చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి రైతులకు యూరియా మరియు క్రాప్ లోన్స్ అందజేశారు. నాంపల్లి మండల కేంద్రంలోని సహకార సంఘ కేంద్రంలో రైతులకు యూరియా మరియు క్రాప్ లోన్స్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రజా పాలనలో ప్రజలకు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజా పాలన సాగుతుందని సింగల్ విండో చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి పేర్కొన్నారు.
రైతులకు పెట్టుబడికి క్రాప్ లోన్స్ 50 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో సింగల్ విండో డైరెక్టర్ వెంకట్ రెడ్డి హరీష సహకార సంఘ సిబ్బంది మరియు రైతులు పాల్గొనడం జరిగింది.
ఇవి కూడా చదవండి