
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్:-
ప్రస్తుతం పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు ఘర్షణలు జరుగుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పటికే ఇరుదేశాల మధ్య జరుగుతున్నటువంటి దాడులలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు మృతిచెందగా.. పాకిస్తాన్ పై ఆఫ్గానిస్థాన్ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతుంది. ఇందులో భాగంగానే తాజాగా పాకిస్తాన్ కు గట్టిగా షాక్ తగిలేలా ఏర్పాట్లు చేస్తుంది ఆఫ్ఘనిస్తాన్. పాకిస్తాన్ కు నీళ్లు వెళ్ళకుండా నియంత్రించాలని ఆఫ్ఘనిస్తాన్ పక్క ప్లాన్ చేస్తుంది అని సమాచారం. ఇప్పటికే కోణార్క్ నదిపై వీలైనంత త్వరగా డ్యాం నిర్మించాలని తాలిబన్ సుప్రీం లీడర్ అయినటువంటి హైబతుల్లా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ డ్యాం కోసం విదేశాల కంపెనీల కోసం ఎదురు చూడకుండా.. సొంత దేశీయ కంపెనీలతోనే ఒప్పందం చేసుకోవాలని సూచించారట. ఇరుదేశాల మధ్య సరిహద్దు ఘర్షణల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆఫ్గానిస్థాన్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుండగా పాకిస్తాన్ దేశస్థులు కాస్త ఆందోళనలో పడ్డారు. మన భారతదేశం కూడా పహల్గాం ఉగ్రదాడి తరువాత సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. మనలాగే ఆఫ్ఘనిస్తాన్ ఆలోచించి పాకిస్తాన్ గట్టిగానే షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధ వాతావరణ పరిస్థితుల వేళ భారత్ ఆఫ్ఘనిస్తాన్ కు పూర్తిగా మద్దతు తెలిపింది.
Read also : చేతిపై సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న మహిళ వైద్యురాలు..!
Read also : దాడుల ఎఫెక్ట్.. పాకిస్తాన్ లో ఆకాశాన్ని అంటుతున్న ధరలు..?





