
Affair: ప్రస్తుత సమాజంలో జరుగుతున్న కొన్ని ఘటనలు మానవ సంబంధాలపై ఆలోచన చేయాల్సిన పరిస్థితిని తెస్తున్నాయి. ఏడు అడుగులతో జీవితాంతం కలిసి ఉండాలనే సంకల్పంతో ప్రారంభమైన భార్యాభర్తల బంధం, కొద్ది రోజులకే అనుమానాలు, మోసాలతో విరిగిపోతున్న ఉదంతాలు కలవరపెడుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారి విస్తృత చర్చకు దారి తీసింది.
యూపీలోని మీరట్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు కేవలం 3 నెలల క్రితమే వివాహం జరిగింది. అతడి భార్య ఓ ప్రముఖ భీమా కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తోంది. పెళ్లి తర్వాత కొద్ది రోజుల నుంచే భార్య ప్రవర్తనలో మార్పులు గమనించిన భర్తకు అనుమానాలు మొదలయ్యాయి. కార్యాలయ పనులంటూ తరచూ బయటకు వెళ్లడం, సమయానికి ఇంటికి రాకపోవడం అతడిని కలవరపెట్టాయి.
అనుమానం బలపడడంతో భర్త ఆమె మొబైల్ ఫోన్‌లో లొకేషన్‌ను ట్రాక్ చేశాడు. ఒక రోజు డ్యూటీకి వెళ్లినట్టు చెప్పిన భార్య లొకేషన్ హోటల్‌లో ఉన్నట్టు చూపించడంతో అతడు అక్కడికి వెళ్లాడు. అక్కడ చూసిన దృశ్యం అతడిని పూర్తిగా షాక్‌కు గురిచేసింది. భార్య మరో వ్యక్తితో కలిసి ఉన్నట్టు గుర్తించాడు.
విచారణలో అసలు నిజం బయటపడింది. ఆ మహిళకు పెళ్లికి ముందే మరో వ్యక్తితో ఆరేళ్లుగా పరిచయం ఉందని, ప్రేమ సంబంధం కొనసాగుతోందని తెలిసింది. కుటుంబ పెద్దల ఒత్తిడి కారణంగానే పెళ్లి చేసుకుందని, అయితే పెళ్లి తర్వాత కూడా ఆ సంబంధాన్ని తెంచుకోలేదని భర్త ఆరోపిస్తున్నాడు.
ఈ ఘటన బయటకు రావడంతో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. పెళ్లి వంటి పవిత్రమైన బంధాన్ని నిర్లక్ష్యం చేయడం, నిజాలను దాచిపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించడం ఎంతటి దారుణ పరిణామాలకు దారి తీస్తుందో ఈ ఘటన చెబుతోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
మానవ సంబంధాల్లో నమ్మకం క్షీణిస్తోందని, ముఖ్యంగా దాంపత్య జీవితం అనుమానాలతో నిండిపోతే అది కుటుంబ వ్యవస్థకే ప్రమాదమని సామాజిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెళ్లికి ముందు నిజాయితీ, స్పష్టత ఉండటం ఎంతో అవసరమని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.
ALSO READ: ప్రియుడి భార్యకు వైరస్ ఇంజెక్షన్ ఇచ్చిన మాజీ ప్రేయసి





