Homeతెలంగాణఫుడ్ సేఫ్టీ రైడ్స్ లో ఐస్ క్రీమ్ కల్తీలు.. పలు గ్రామాల్లో బండ్లు నిషేధం!

ఫుడ్ సేఫ్టీ రైడ్స్ లో ఐస్ క్రీమ్ కల్తీలు.. పలు గ్రామాల్లో బండ్లు నిషేధం!

క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క ఆహార పదార్థంలోనూ కల్తీ జరుగుతున్న సందర్భంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు చాలా చోట్ల రైడ్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలలో కల్తీలు జరుగుతున్నాయి అని వీటి ద్వారా పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు అని తేలింది. ఈ సందర్భంలోనే ఐస్ క్రీమ్ కల్తీ నుంచి పిల్లలను కాపాడుకునేందుకు నిజామాబాద్ జిల్లాలోని దాదాపు మూడు గ్రామాలు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నాయి. ఆర్మూర్ మండలం(అంకాపూర్), జక్రాన్ పల్లి మండలం ( కొలిపాక ), వేల్పూర్ మండలం (అంక్సాపూర్) ఈ మూడు గ్రామాలు ఐస్ క్రీమ్ బండ్ల ప్రవేశాన్ని నిషేధించాయి. కేవలం నిషేధించడం మాత్రమే కాకుండా నిబంధనలను ఉల్లంఘిస్తే ఖచ్చితంగా 5000 రూపాయల జరిమానా విధిస్తాము అని ఆ గ్రామాలు ప్రకటించడంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారింది. దీంతో ఒకవైపు నిజాయితీగా మంచి ఐస్ క్రీమ్స్ సరఫరా చేసేటటువంటి ఫ్యాక్టరీలకు కూడా కాస్త ఇబ్బందిగా మారుతుంది. ఫుడ్ సేఫ్టీ రైడ్స్ లో భాగంగా ఐస్ క్రీమ్స్ లో ఎక్కువగా కల్తీలు జరుగుతున్న వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుండడంతో పలు గ్రామాలు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి అని అర్థమవుతుంది.

తిరుప‌తిలో దారుణం… ఒంట‌రిగా ఉన్న మ‌హిళ‌పై ఇంటి య‌జ‌మాని…!

దేశంలో నేష‌న‌ల్ క్వాంటం మిష‌న్ ప్రారంభం…7వ దేశంగా భార‌త్‌…!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments