
మహేశ్వరం,క్రైమ్ మిర్రర్ :- తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాలలో ఆదిభట్ల పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని వాహనాలకు వివిధ రకాల చాలాన్లు విధించారు.అలాగే యువకులకు తల్లిదండ్రులకు ఆదిభట్ల సీఐ రవికుమార్ వగాహన కల్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. దేశం బాగుండాలంటే మొట్ట మొదట మనం బాగుండాలని కోరుతూ..యువత చేడుదారి పట్టకుండా ఉండాలంటే తల్లి దండ్రులు వారిపై ఒక నిఘా పెట్టాలని అన్నారు.చిన్న వయస్సులోనే యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలని నాశనం చేసుకుంటున్నారని గ్రామస్తులకు వివరించారు.
Read also : మీ క్రైమ్ మిర్రర్ తరపున.. కృష్ణాష్టమి స్పెషల్!.. ఇలానే జరుపుకోవాలి?
చదువుకునే సమయంలో చదువుపై దృష్టి పెట్టకుండా చెడు స్నేహితులతో చేతులు కలిపి యువత పక్కదారి పడుతుందన్నారు. మైనర్లకు ద్విచక్ర వాహనాలు,కార్లు నడిపితే పూర్తి బాధ్యత తల్లిదండ్రులే తీసుకోవలసి వస్తుందని పేర్కొన్నారు. రెండు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాలని చెప్పారు. తమ పిల్లలను చిన్న వయస్సులోనే క్రమశిక్షణలో పెట్టాలని అన్నారు. గ్రామంలో అనుమానాస్పదంగా గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా తిరిగితే వెంటనే 100 నంబర్ కు కాల్ చేసి చెప్పాలన్నారు. వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.హెల్మెట్ లేకుండా రోడ్డుపై వెళ్లరాదని, సరైన పత్రాలు లేకుండా నడుపరాదని.. గ్రామ ప్రజలకు, యువకులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆదిభట్ల సిఐ రవికుమార్,ఎస్ ఐ సత్యనారాయణతో పాటు సుమారు 50 మంది పోలీసులు పాల్గొన్నారు.
Read also : నన్ను క్షమించండి.. అనుకోకుండా తప్పు జరిగింది : ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు