Monday, March 23, 2026
HomeజాతీయంActor Pawan: నటికి లైవ్‌లో ప్రపోజ్ చేసిన హీరో

Actor Pawan: నటికి లైవ్‌లో ప్రపోజ్ చేసిన హీరో

Actor Pawan: పవన్ అనగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది టాలీవుడ్ స్టార్ నటుడే. కారణం లేకపోలేదు. ఇటీవలి కాలంలో పవన్ అనే పేరుతో పలువురు హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడంతో ఈ పేరు మరింత హాట్‌గా మారింది. అయితే ఈ వార్త మాత్రం టాలీవుడ్‌కు చెందిన పవన్ గురించి కాదు. ఇది భోజ్‌పురి సినీ పరిశ్రమలో సింగర్‌గా, నటుడిగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న పవన్ సింగ్‌కు సంబంధించినది. భోజ్‌పురి ప్రేక్షకుల్లో పవన్ సింగ్ అంటే ఒక సెన్సేషన్. ఆయన పాటలు విడుదలైన ప్రతిసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంటే, స్టేజ్‌పై ఆయన చేసే పర్ఫార్మెన్స్‌లు కూడా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంటాయి. అలాంటి పవన్ సింగ్ తాజాగా ఓ లైవ్ షోలో చేసిన సరదా పని అక్కడున్న ఆడియన్స్‌ను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది.

భోజ్‌పురిలో జరిగిన ఓ లైవ్ ఈవెంట్‌లో పవన్ సింగ్ తనదైన ఎనర్జీతో ప్రేక్షకులను అలరిస్తున్న సమయంలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. స్టేజ్‌పై తనతో పాటు ఉన్న ఓ నటి‌తో సరదాగా మాట్లాడుతున్న సందర్భంలో పవన్ సింగ్ ఒక్కసారిగా వ్యక్తిగత ప్రశ్న వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ‘నీకు పెళ్లయిందా?’ అంటూ ప్రశ్నించగా, ఆ నటి కూడా ఎలాంటి మొహమాటం లేకుండా ‘ఇంకా కాలేదు, మంచి అబ్బాయి కోసం వెతుకుతున్నాను’ అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. అంతే, అక్కడి నుంచే పవన్ సింగ్ తనదైన శైలిలో సరదా సంభాషణను మొదలుపెట్టాడు.

‘ఇంకెక్కడో వెతకడం ఎందుకు? నీ కళ్ల ముందే ఒకడు ఉన్నాడుగా. నాకేం తక్కువ? కాస్త నల్లగా ఉంటానేమో కానీ, సంస్కారం ఉంది, చేతినిండా సంపాదిస్తున్నాను. అందగాడిని కాకపోవచ్చు కానీ, మంచివాడిని. మీ ముందున్న నన్నే చూసుకోండి’ అంటూ స్టేజ్‌పైనే మ్యారేజ్ ప్రపోజల్ చేసినట్టుగా మాట్లాడాడు. పవన్ సింగ్ ఈ మాటలు అనగానే అక్కడున్న ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇది స్క్రిప్ట్‌లో భాగమా? లేక పవన్ సింగ్ ఇంప్రోవైజేషన్ చేశాడా? అన్న సందేహాలు కూడా తలెత్తాయి. స్టేజ్‌పై ఉన్న నటి పరిస్థితి అయితే ఇంకా ఆసక్తికరంగా మారింది.

ఈ హఠాత్ పరిణామానికి ఆమె మొదట కాస్త ఆశ్చర్యపోయినా.. వెంటనే పరిస్థితిని చాలా స్పోర్టివ్‌గా తీసుకుంది. నవ్వుతూ ‘ఈ కాలం అబ్బాయిలు ఉదయం హాయ్ చెబుతారు, సాయంత్రం బై చెబుతున్నారు’ అంటూ పవన్ సింగ్‌కు కౌంటర్ ఇచ్చింది. దీంతో అక్కడి వాతావరణం మరింత సరదాగా మారింది. పవన్ సింగ్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ‘అమ్మాయిలు కూడా అంతేనమ్మా’ అంటూ మరో పంచ్ పేల్చాడు. ఈ మాటల యుద్ధం ప్రేక్షకులను నవ్వులపాలుచేయగా, స్టేజ్ మొత్తం హుషారుతో నిండిపోయింది.

ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ‘పవన్ సింగ్ ఎనర్జీ వేరే లెవల్’, ‘స్టేజ్ ప్రెజెన్స్ అంటే ఇదే’ అంటూ కొందరు అభిమానులు కామెంట్లు చేస్తుంటే, మరోవైపు ఆయన వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ ‘వైవాహిక జీవితం తెలిసినవాళ్లకు ఇది పెద్ద జోక్’ అంటూ కొందరు నెటిజన్లు సెటైర్లు కూడా వేస్తున్నారు. ఏది ఏమైనా, తన మాటలతో, తన స్టేజ్ పర్ఫార్మెన్స్‌తో మరోసారి భోజ్‌పురి ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో పవన్ సింగ్ హాట్ టాపిక్ అయ్యారన్నది మాత్రం వాస్తవం.

ALSO READ: ఇలా సంపాదించొచ్చా!.. సరసాలతో రూ.30 కోట్ల సంపాదన

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు.డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు.క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments