క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో ప్రమాదం ఒకరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడిన ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో అత్యవసర విభాగం భవనంలో పునర్నిర్మాణ పనులు జరుగుతుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తుంది. ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (ESI Medical College and Hospital) అత్యవసర వార్డులో భవనం ఐదవ అంతస్తులో పునర్నిర్మాణ పనుల్లో భాగంగా నిర్మాణ సామాగ్రిని తరలించడానికి ఏర్పాటు చేసిన తాత్కాలిక లిఫ్ట్ (suspended platform) లేదా సెంట్రింగ్ (తాత్కాలిక నిర్మాణ మద్దతు) కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లాకు చెందిన భానుచందర్ (24) అనే సబ్-కాంట్రాక్టర్ మృతి చెందాడు. మరో నలుగురు కార్మికులు గాయపడ్డారు, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదానికి గల కారణాలు తాత్కాలిక ప్లాట్‌ఫారమ్ సామర్థ్యానికి మించి మార్బుల్ స్లాబ్‌లను లోడ్ చేయడం వల్ల అది కూలిపోయిందని ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్మాణ సమయంలో భద్రతా ప్రమాణాలను పాటించారా, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగిందా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.





