
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి, మాడుగులపల్లి:-
ధాన్యం బస్తాలను లారీలో లోడ్ చేస్తుండగా ప్రమాదం
ఐకెపి కేంద్రంలో ధాన్యం బస్తాలను లారీలో లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు బస్తాలు కూలి ముగ్గురు హామాలీలకు తీవ్ర గాయాలైన ఘటన మాడుగులపల్లి మండలం పాములపహాడ్ గ్రామంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది.. స్థానిక తెలిపిన వివరాల ప్రకారంగా… నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం పరిధిలోని పాములపహాడ్ గ్రామ ఐకెపి సెంటర్లో రైతుల ధాన్యం కంటా అనంతరం బస్తాలను లారీలు లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు బస్తాలు కూలి అదే గ్రామానికి చెందిన హమాలీలు ఏర్పుల లింగయ్య, గండమల్ల కృష్ణయ్య, బొల్లెద్దు వెంకన్న అనే ముగ్గురి హమాలీలకు తీవ్ర గాయాలపాలు అవడం జరిగింది. ఈ ముగ్గురిలో గండమల్ల కృష్ణయ్య లారీ పై కింద పడిపోవడంతో క్రింద లారీ వద్దకు ధాన్యం బస్తాలను మోసుకొస్తున్న లింగయ్య, వెంకన్నలపై బస్తాలు ఒక్కసారిగా మీద పడుకోవడంతో ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. మిగతా హమాలీలు వెంటనే గమనించి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు… మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్ సహాయంతో సూర్యాపేట కు తరలించారు.
కెప్టెన్ మారినా… మారని చెన్నై రాత?… ఓటమిపై స్పందించిన ధోని!..