మల్కాజిగిరి, క్రైమ్ మిర్రర్: మల్లాజిగిరి పోలీసు స్టేషన్ పరిధిలో రూ. 15వేలు లంచం తీసుకుంటూ ఏసీబి అధికారుల చేతికి చిక్కిన ఘటన ఆ ప్ ప్రాంతంలో కలకలం రేపింది. చైతన్యపురి పోలీసు స్టేషన్ లో విధు నిర్వహిస్తున్న బాలయ్య రూ.15వేలు బాధితుడి నుంచి తీసుకుంటూ ఏసిబీకి చిక్కిన వైనం అధికారుల వర్గాల్లో చర్చానీయాంశమైంది.కాంప్రమైజ్ అయిన మహిళా వేధింపుల కేసును రంగారెడ్డి జిల్లా కోర్టులో లోక్ అదాలత్ ద్వారా క్లోజ్ చేయించడానికి రూ.15 వేల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దీంతో చైతన్య పురి పోలీసు స్టేషన్లో 363/2025లో పల్లపు రాంబాబు పై మహిళా వేధింపుల కేసు నమోదు చేశారు. ఈ కేసు క్లోజ్ కావాలంటే లోక్ అదాలత్ ద్వరా చేయించుకోవాలని ఎఎస్ ఐ బాలయ్య లంచం డిమాండ్ చేశారు.. దీంతో బాధితుడు పల్లపు రాంబాబు ఏసీబీ(అవినీతి నిరోధకశాఖ) అధికారులను ఆశ్రయించాడు. అధికారులు ముందస్తుగా ట్రాప్ ఏర్పాటు చేసి కోర్టు ప్రాంగణంలోనే బాలయ్య లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
