
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- టీమిండియా యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ మరో రికార్డును నమోదు చేశాడు. ఐసీసీ టి20 క్రికెట్ ఫార్మేట్ ర్యాంకింగ్స్ లో అభిషేక్ శర్మ నెంబర్ వన్ బ్యాటర్ గా నిలిచారు. 829 పాయింట్లతో అభిషేక్ శర్మ మొదటి స్థానంలో ఉన్నారు. ఇక ఆ తరువాత ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్ రెండవ స్థానంలో ఉన్నారు. మొదటగా టి20 ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో ఉన్న ట్రావిస్ హెడ్ ఇప్పుడు రెండవ స్థానానికి పడిపోయారు. ఇక ఈ ఐసీసీ టి20 ర్యాంకింగ్స్ లో టీమిండియా తరఫునుంచి తిలక్ వర్మ అలాగే సూర్య కుమార్ యాదవ్ మొదటి పది స్థానాల్లో నిలిచారు. ఇక మరోవైపు టెస్ట్ ర్యాంకింగ్స్ లో చూసుకుంటే.. రిషబ్ పంత్ ఏడవ స్థానానికి చేరుకున్నారు. టీమిండియాలో యంగ్ ప్లేయర్స్ అయినటువంటి జశ్వంత్ మరియు గిల్ 8, 9 స్థానాల్లో ఉన్నారు. ఇక ఆల్రౌండర్ పరంగా రవీంద్ర జడేజా నెంబర్ వన్ టెస్ట్ ఆల్రౌండర్ గా కొనసాగుతూ ఉన్నారు.
Also Read : భారత్ ప్రజలకు గుడ్ న్యూస్… భూకంపం ముప్పు లేదు!
కాగా ఈ మధ్య టీం ఇండియా జట్టులో చాలామంది యువ ప్లేయర్స్ అద్భుతంగా రాణిస్తూ వస్తున్నారు. కేవలం ఒక్క ఫార్మాట్ కు మాత్రమే పరిమితం అవ్వకుండా… గిల్ అలాగే జైష్వాల్ లాంటి ప్లేయర్స్ అన్ని ఫార్మాట్లకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు టి20 లో అభిషేక్ శర్మ మరియు తిలక్ వర్మ అలాగే రింకు సింగ్ లాంటి ప్లేయర్స్ చాలా బాగా రాణిస్తున్నారు. ఇక ఆల్రౌండర్ పరంగా తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అలాగే వాషింగ్టన్ సుందర్ ఇద్దరూ కూడా చాలా బాగా రాణిస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో టీమిండియా యంగ్ ప్లేయర్స్ తోనే బరిలోకి దిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్లు కొన్ని ఫార్మేట్లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో వారి లేని లోటును ఎవరు తీరుస్తారని చాలామంది… బాగోద్వేగానికి లోనయ్యారు. కానీ వారి స్థానాలను ఈ ఎందుకు ప్లేయర్స్ ఫుల్ ఫిల్ చేసే అవకాశం ఉంది.