అంతర్జాతీయంక్రీడలు

పాకిస్తాన్ అమ్మాయిల గుండెల్లో అభిషేక్ శర్మ.. గూగుల్లో తెగ వెతికేస్తున్నారంట?

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- ప్రపంచ క్రికెట్ చరిత్రలో 6 సిక్సులు కొట్టినటువంటి యువరాజ్ సింగ్ ప్రతి ఒక్కరికి తెలుసు. మరి అలాంటి యువరాజ్ సింగ్ దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి అభిషేక్ శర్మ అతనికి మించిపోయేలా ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం మన భారత జట్టు తరుపున ఆడిన ప్రతి టి20 మ్యాచ్ లో బ్యాటింగ్ మొదలుపెట్టిన మొదటి బంతికే సిక్స్ కొట్టే ప్లేయర్ గా మారిపోయాడు. ఇక తాజాగా పాకిస్తాన్ అమ్మాయిలు గూగుల్లో ఎక్కువగా అభిషేక్ శర్మ గురించి సెర్చ్ చేస్తున్నారు అని తేలింది. భారత్ బ్యాటింగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మకు పాకిస్తాన్ లో మామూలుగా క్రేజ్ లేదు.

Read also : బిగ్ బ్రేకింగ్ న్యూస్.. WWE “జాన్ సీనా” రిటైర్మెంట్

అది ఎంతలా అంటే… ఇపుడు పాకిస్తాన్ దేశంలో ఎంతమంది స్టార్ క్రికెటర్లు ఉన్నారు. బాబర్ అజామ్, షాహిన్ ఆఫ్రిది వంటి ఎంతోమంది స్టార్ క్రికెటర్ లు వాళ్ళ దేశంలో ఉన్నా కూడా వారందరిని కాదని మన భారత యువ డేంజరస్ క్రికెటర్ అభిషేక్ శర్మ గురించి ఆరా తీస్తున్నారట. పాకిస్తాన్లోని ప్రతి క్రికెట్ లవర్ గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేసింది మన అభిషేక్ శర్మ గురించే అని స్పష్టం అయింది. ఎక్కువ మంది పాకిస్తాన్ అమ్మాయిలు ఈమధ్య గూగుల్లో సెర్చింగ్ చేసిన క్రికెటర్లలో మొదటి స్థానంలో అభిషేక్ శర్మ ఉండగా రెండవ స్థానంలో ఆ దేశ క్రికెటర్ నవాజ్ ఉన్నారు. కాగా ఇటీవల ఆసియా కప్ లో కూడా పాకిస్తాన్ దేశం పై అభిషేక్ శర్మ విరుచుకుపడిన విషయం తెలిసిందే. వరుసగా పాకిస్తాన్ జట్టుపై 74, 31 పరుగులతో పాకిస్తాన్ బౌలర్లకు దడ పుట్టించాడు.

Read also : దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సి భారత్ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button