
– అనుమానాస్పద స్థితిలో అంబటిపల్లి యువకుడు మృతి
– విషాద ఛాయలు అలుముకున్న అంబటిపల్లి గ్రామం
– ఆనంద్ మరణం కోలుకోలేనిది: మిత్రులు
క్రైమ్ మిర్రర్,మహాదేవ్ పూర్ :- అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది, వివరాల్లోకి వెళితే జయశంకర్ జిల్లా, మహాదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామానికి చెందిన బాసాని ఆనంద్ (27) హైదరాబాదులోని ఒక ప్రైవేటు హాస్టల్లో ఉంటూ గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నాడు. ఇదే క్రమంలో గురువారం అర్ధరాత్రి హాస్టల్ మూడో ఫ్లోర్ నుంచి క్రిందపడి ప్రాణాలు విడిచాడు. దురదృష్టవశాస్తూ కిందపడి మరణించాడా లేదా ఇంకేమైనా కారణం ఉందా?.. అనే కోణంలో పోలీసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఆనంద్ మరణంతో అంబటి పెళ్లి గ్రామంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి.
Read also : తెలంగాణలో మారునున్న వాతావరణం.. మూడు రోజులపాటు వర్షాలు!
Read also : తెలంగాణాలో మరో 32 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు





