క్రైమ్తెలంగాణ

ప్రేమించిన యువతి మృతి చెండడంతో- మనస్థాపంతో యువకుడి ఆత్మహత్యయత్నం

క్రైమ్ మిర్రర్, షాద్ నగర్: ప్రేమించిన యువతి చనిపోవడంతో మనస్థాపానికి గురైన యువకుడు తను ఉంటున్న హాస్టల్ పై నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన చందు అనే విద్యార్థి షాద్ నగర్ పట్టణంలోని పాత జాతీయ రహదారిలో గల బిసి బాలుర కళాశాల వసతి గృహంలో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుకుంటున్నాడు.

ఇంటర్ పరీక్షలు పూర్తయినప్పటికీ చందు తన స్వగ్రామానికి వెళ్లకుండా హాస్టల్ లోనే ఉంటున్నాడు. నెల రోజుల క్రితం తను ప్రేమించిన యువతి మరణించడంతో మనస్థాపనతో ఉన్న చందు తాను కూడా తను చాలించాలనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆదివారం చందు తను ఉంటున్న హాస్టల్ గదిలో ఎవరూ లేనిది చూసి ఫ్యాన్ కు బెడ్ షీట్ తో బిగించి ఉరివేసుకొనేందుకు ప్రయత్నించి విఫలం అయ్యాడు. అనంతరం హాస్టల్ బిల్డింగ్ పై నుండి చందు కిందకు దూకేశాడు.

Also Read : హయత్ నగర్ లో రోడ్డు ప్రమాదం.. అడిషనల్ ఎస్పీ దుర్మరణం

షాపింగ్ మాల్ ముందు చందు తీవ్ర గాయాలతో పడి ఉండడాన్ని చూసిన సెక్యూరిటీ సిబ్బంది స్థానికుల సహాయంతో వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం షాద్ నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హాస్టల్లో ఉంటున్న డిగ్రీ విద్యార్థులు చందు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇదిలా ఉండగా తన తమ్ముడు ప్రేమించిన అమ్మాయి చనిపోవడంతో కొంతకాలంగా మనస్సపంతో ఉన్నాడని , ఇందులో భాగంగానే హాస్టల్ భవనం పై నుండి జూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉంటాడంటూ చందు అన్న విష్ణు షాద్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

ఇవి కూడా చదవండి …

  1. TollyWood: టాలీవుడ్‌ మెడకు బెట్టింగ్‌ ఉచ్చు – త్వరలోనే ప్రముఖుల అరెస్ట్‌..?

  2. 5000 రూపాయలు ఇస్తేనే కాపురం చేస్తా అంటున్న భార్య!… ఇదెక్కడి విడ్డూరం..

  3. బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్న 11 మంది పై కేసులు నమోదు!… పెద్ద నటులే అందరూ?

  4. యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ముసలి కామాంధుడు… చివరికి ఏమైందంటే?

Back to top button