తెలంగాణనల్గొండ

కంటతడి పెట్టిన మాజీమంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి

  • నల్లగొండలో దీక్షా దివస్ విజయవంతం… కిక్కిరిసిన సభా ప్రాంగణం
  • నాటి తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని ఉద్వేగంగా పూసగుచ్చిన మాజీ మంత్రి గుంట కండ్ల.
  • కెసిఆర్ ఆమరణ నిరాహారదీక్ష ప్రస్తావిస్తూ… తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టిన జగదీష్ రెడ్డి
  • ఒక్కసారిగా సభ.. చలించి అనేకమంది కంట తడి కనిపించింది

క్రైమ్ మిర్రర్ నల్గొండ బ్యూరో: నల్లగొండ దిక్ష దివాస్ లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్ :
1996లోనే తెలంగాణ చర్చ మొదలైంది. ఆరోజే కెసిఆర్ చెప్పాడు… నిర్మల్ కు చెందిన సత్యనారాయణగౌడ్ తో…
టీడీపీలోనే ఉన్నపుడే ఆ ఆలోచన చేశారు. చంద్రబాబు అండ్ కో… మీడియా దుర్మార్గపు ప్రచారం చేస్తునట్లుగా పదవీ కోసం కాదు… రైతుగా తెలంగాణ కోసం… ఆలోచించాడు. తెలంగాణ వ్యవసాయాన్ని ప్రపంచబ్యాంకుకు అప్పజెప్పినపుడు నేను అంగీకరించను అని కెసిఆర్ ఆనాడే చెప్పాడు. విద్యుత్ ఛార్జిలను ఒప్పుకోను అని కెసిఆర్ చెప్పారూ… దానితోనే నేను బయటికి వచ్చా… మానసికంగా 8 నెలల పాటూ ఉద్యమకారులతో చర్చించి తెరాస ఏర్పాటు. నా ద్యేయం… నా స్వప్నం తెలంగాణ అని ఆ నాడే ప్రకటించారు.

చంద్రబాబు ఆనాడే కుట్రలకు తెర లేపారు. కేంద్రంలోని బీజేపీ ఆయన చేతుల్లో ఉన్నది. ఆ రోజే పార్టీకి, పదవులకు పదవులకు రాజీనామా చేసి వచ్చారు. కెసిఆర్ పై చంద్రబాబు దుష్ప్రచారం చేసాడు. కానీ వీటిని చేదిస్తూ కెసిఆర్ ముందుకు సాగింది. ఆర్టికల్ 3 ద్వారా పార్లమెంట్ ద్వారా తెలంగాణ సాధించుకుందాం అని చెప్పారు. అహింస మార్గంలో సాధిద్దాం అని అందర్నీ ఒప్పించారు. 2004 ఎన్నికల్లో సోనియాగాంధీ ఇచ్చిన అవకాశంతో బిఆరెస్ పొత్తుకు సిద్దపడింది. ఉద్యమాన్ని ఎన్ని అటుపోట్లు ఎదురైనా నిలబెట్టుకుంటూ వచ్చారు. తెలంగాణ రాష్ట్రమే ఊపిరిగా బతికాడు కాబట్టే రాష్ట్రం సాధించాం. ఉద్యమాన్ని అణిచివేసేందుకు అనేక కేసులు పెట్టరూ. చెరుకు సుధాకర్ పై పీడీ యాక్ట్ పెట్టారు. ఇవ్వన్నీ చూసే… నవంబర్ 29న కెసిఆర్ సచ్చుడో… తెలంగాణ వచ్చుడో అన్న నినాదం తో కెసిఆర్ ఆమరణ దీక్షకు సిద్దపడ్డారు. అయితే పార్టీ నేతలు, శ్రేణులు వద్దని వారించారు. కానీ కెసిఆర్ మొండితనం ముందు మేమే తలవంచక తప్పలేదు. ఆమరణదీక్షలోనూ కుట్రలు చేశారు. నిమ్మరసం తాగినట్లుగా దీక్ష విరమంచినట్లుగా ప్రభుత్వం ప్రకటన చేసింది.

కెసిఆర్ దీక్ష కొనసాగుతుంది అని కెసిఆర్ తరుపున నేను ప్రకటించిన. కెసిఆర్ దిక్ష విరమించకుండా మొండికి వేయడంతో కేంద్రం దిగి వచ్చింది. కానీ హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఇస్తామన్నారు. దీనికి కెసిఆర్ ఒప్పుకోలేదు. తెలంగాణ లేకుండా కెసిఆర్ బయటకు రానూ అన్నారు. ( జగదీశ్ రెడ్డి భావోద్వేగం ). దీనితో కేంద్రం దిగిరాక తప్పలేదు. దీనికి కెసిఆర్ దీక్షనే కారణం. ఇది చరిత్ర. కానీ కెసిఆర్ దీక్షనూ అప్రతిష్టపాలు చేసేలా దుస్ప్రచారం చేశారు. సీమంద్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక్కటై డిసెంబర్ 23న అడ్డుకున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్.. అధ్యక్షత వహించిన ఈ సభలో.. దీక్షా దివస్ ఇంచార్జి మహబూబ్నగర్ మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు… మాజీ శాసనసభ్యులు.. కంచర్ల భూపాల్ రెడ్డి గారు నల్లమోతు భాస్కరరావు, చిరుమర్తి లింగయ్య, నోముల భగత్ కుమార్, సీనియర్ నాయకులు, చకిలం అనిల్ కుమార్, చెరుకు సుధాకర్, పాల్వాయి స్రవంతి, దూదిమెట్ల బాలరాజు యాదవ్, మాలే శరణ్య రెడ్డి, రామచంద్రనాయక్, కటికం సత్తయ్య గౌడ్, బొర్ర సుధాకర్, రేగట్టె మల్లికార్జున్రెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, నాయకులు అన్నపర్తి శేఖర్, యత్తపు మధుసూదన్ రావు, కొత్త పాటి సతీష్, పలువురు మాజీ ఎంపీపీలు, జడ్పిటిసిలు, సర్పంచులు… ముఖ్య నాయకులు భారీ సంఖ్య లో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు చదవండి…

కుండపోత వానలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు

డిసెంబర్ 3న టీడీపీలోకి తీగల.. ఆయనతోనే ఆకుల అర్వింద్ కుమార్

జనవరిలో సర్పంచ్ ఎన్నికలు.. ముగ్గురు పిల్లల్లున్నా పోటీ చేయొచ్చు

నాగబాబుకి కీలక పదవి…ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్?

అయ్యప్ప స్వాములకు బ్రీత్ అనలైజర్ టెస్ట్.. ఆర్టీసీలో దుమారం 

ఫుడ్ పాయిజన్‌తో 38 మంది విద్యార్థులు మృతి.. తెలంగాణలో ఘోరం 

కోటి 10 లక్షల ఇండ్లలో సమగ్ర సర్వే పూర్తి

సీఎం రేవంత్ జిల్లా మరో దారుణం.. పిల్లల సాంబారు,చట్నీలో బొద్దింక

అయ్యప్ప మాలలో కడప దర్గాకు రాంచరణ్

కుర్ కూరే తినడం వల్లే పిల్లలకు అస్వస్థత.. హైకోర్టుకు సర్కార్ రిపోర్ట్

ఆర్జీవి కోసం ఏకంగా రెండు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు!

8 నెలల తర్వాత కవిత ఫవర్ ఫుల్ స్పీచ్.. సీఎం రేవంత్‌కు టెన్షన్

రేవంత్ రెడ్డికి రాహుల్ క్లాస్.. అదాని 100 కోట్లు రిటర్న్

గజగజ వణుకుతున్న జనాలు.. తెలంగాణలో చలి పంజా

పాతబస్తీలో నేను చెప్పిందే ఫైనల్.. మేయర్‌కు MIM ఎమ్మెల్యే వార్నింగ్

సీఎం రేవంత్‌కు సీపీఎం నేత తమ్మినేని వార్నింగ్

సచివాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఘోర అవమానం

రేవంత్ టచ్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. జంప్ అయ్యేది వీళ్లే..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button