విశాఖపట్నం, క్రైమ్ మిర్రర్ః క్రికెట్ ఆటలో చిన్న గొడవ అది కాస్తా ముదిరి యువకుడి ప్రాణాలు బలితీసుకుంది. మాట్లాడుకుందామని పిలిచి యువకుడిపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి చంపేసిన ఘటన పెదగదిలిలో చోటు చేసుకుంది.. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. కత్తిపోట్లకు యువకుడు అక్కడికక్కడే మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది.
పోలీసుల కథనం ప్రకారం క్రికెట్ ఆడుతున్నసమయంలో అజిత్(23), కిషోర్(26) మద్య వివాదం తలెత్తింది. మ్యాచ్ ముగిసిన తరువాత కిషోర్ ఆగ్రహంతో మాట్లాడుకుందామని పిలిచి పెద్దగదిలి జంక్షన్ వద్ద అందరూ చూస్తుండగానే అజిత్‌త్‌పై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన అజిత్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు సీఐ మల్లేశ్వరరావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడు డిగ్రీ పూర్తి చేసుకొని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. చేతికొచ్చిన కొడుకు అర్థాంతరంగా మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
