
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా ప్రతి విషయం పట్ల బాధ్యతయుతంగా ఉండాలి అని హైదరాబాద్ సిపి సర్జనార్ సూచించారు. పోలీస్ అధికారులు, ఆర్టీసీ సిబ్బంది, ఉపాధ్యాయులు ఇలా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వారి విధులకు ఆటంకం కలిగిస్తే ఖచ్చితంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వ ఉద్యోగులపై కొంతమంది కావాలనే దాడులు చేస్తున్నారు అని అన్నారు. ఇకపై ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి పైన అయినా సరే దాడులు చేస్తే కచ్చితంగా చట్ట ప్రకారం బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా వారిపై హిస్టరీ షీట్స్ కూడా తీస్తామని సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ క్షణికావేశంలో చిన్న చిన్న తప్పులు చేస్తూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.. ఇకనుంచి ఏ చిన్న తప్పు చేసిన కచ్చితంగా జీవితాంతం కూడా కుమిలి పోవలసి వస్తుంది అని సజ్జనార్ కీలక ప్రకటన జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించిన… బెదిరింపులకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని అన్నారు. ఒక్కసారి కనుక కేసు నమోదు అయితే భవిష్యత్ నాశనం అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి… భవిష్యత్తులో మీరు ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులు కారు కాబట్టి.. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నడుచుకోవాలని ప్రకటన విడుదల చేశారు.
Read also : ప్రశ్నించే గొంతులను సీఎం నొక్కే ప్రయత్నం చేస్తున్నారు : హరీష్ రావు
Read also : అంతా ముగిసింది అనుకునే లోపే మరోసారి దాడులు!





