తెలంగాణ

సీఎం రేవంత్ కు దిమ్మతిరిగే షాక్.. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు జంప్!

తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ అధికారం చేపట్టి 10 నెలలు పూర్తైంది. అత్తెసరు మెజార్టీతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ వలసలతో బలం పెంచుకుంది. సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన ఆపరేషన్ ఆకర్శ్ తో ఇప్పటివరకు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు రేవంత్ తో టచ్ లోకి వెళ్లారని.. రేపుమాపో గాంధీభవన్ గడప తొక్కుతారనే వార్తలు వచ్చాయి. గతంలో కాంగ్రెస్ ఎస్పీని బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేశారు. అందుకు ప్రతీకారంగా బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ ఎల్పీలో విలీనం చేసేలా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారనే టాక్ వచ్చింది.

కాని ఇప్పుడు తెలంగాణలో సీన్ మారిపోయింది. కాంగ్రెస్ పార్టీలోకి వలసలు తగ్గిపోయాయి. అదే సమయంలో అధికార పార్టీలో కుమ్ములాటలు పెరిగిపోయాయి. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఏకంగా ఇద్దరు ఎమ్మెల్సీలు తిరుగుబాటు చేసేలా కనిపిస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్న.. అధికార పార్టీలోనే ఉంటూ కొరకరాని కొయ్యగా మారారు. కేసీఆర్ ను ఓడించడంలో కీలక పాత్ర పోషించిన తీన్మార్ మల్లన్న.. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి చుక్కలు చూపిస్తున్నారు. ఎమ్మెల్సీగా గెలిచి నాలుగు నెలలే అవుతున్నా.. ఆయన బీసీ గళంతో కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేస్తున్నారు. బీసీల హక్కులు కాలరాస్తున్నారంటూ రెడ్డను తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోస్తున్నారు. తన యూట్యూబ్ ఛానెల్ లో సీఎం రేవంత్ రెడ్డిని డైరెక్ట్ గానే తిడుతున్నారు. రెడ్డి మంత్రులను కడిగిపారేస్తున్నారు. గ్రూప్ 1 వివాదంతో పాటు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో దూకుడుగా వెళుతున్నారు తీన్మార్ మల్లన్న. కాంగ్రెస్ పార్టీ బీసీలకు మోసం చేస్తుందని మండిపడుతున్నారు.

అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఉంటూనే జీవో 29కు వ్యతిరేకంగా ప్రభుత్వంపై తీన్మార్ మల్లన్న గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. బీసీల కోసం కాంగ్రెస్ ను వదిలేస్తాననే సంకేతం ఇచ్చారు. మంత్రులు, జర్నలిస్టుల కొరియా పర్యటనపైనా విమర్శలు చేశారు. మంత్రి పొంగులేటిని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే కొరియా పంపించారు. ఈ పర్యటనను విమర్శించడమంటే సీఎం రేవంత్ ను అన్నట్లే.తీన్మార్ మల్లన్న తీరుతో ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్దమయ్యారని భావిస్తున్నారు. పార్టీ వీడాలని డిసైట్ అయినందునే సీఎం రేవంత్ రెడ్డిని పబ్లిక్ గానే తిడుతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

Read More : బీసీల గొంతుక తీన్మార్ మల్లన్నను టార్గెట్ చేసిన రెడ్లు!

Read More : ఇంక్ లేదు.. వచ్చాక రండి.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బోర్డు

తీన్మార్ మల్లన్న బాటలోనే సీనియర్ నేత జీవన్ రెడ్డి ఉన్నారని తెలుస్తోంది. మీకో దండం.. మీపార్టీకో దండం అని టీ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కు నేరుగా చెప్పేశారు జీవన్ రెడ్డి. జగిత్యాలలో ఆయన అనుచరుడి హత్య జరిగింది. ఇది పాతకక్షల వల్ల జరిగిందని పోలీసులు చెబుతున్నారు. కానీ తనను బలహీనం చేయడానికి కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఇదంతా చేస్తున్నారని జీవన్ రెడ్డి అంటున్నారు. మమ్మల్ని బతకనీయరా అని మండిపడుతున్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా తన సీనియార్టీని గుర్తించి మంత్రి పదవి ఇస్తారని ఆయన అనుకున్నారు. అలాంటి ఆలోచన కూడా రాష్ట్ర, కేంద్ర నాయకత్వాలు చేయలేదు. పైగా తనపై గెలస్తూ వస్తున్న సంజయ్ కుమార్ ను రాత్రికి రాత్రి పార్టీలో చేర్చుకున్నారు. దీంతో నలభై ఏళ్ల పాటు జగిత్యల కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా ఉన్న ఆయనకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. తాజాగా జరిగిన హత్య ఘటనతో ఆయన ఆవేశంతో రెచ్చిపోతున్నారు.

Back to top button