తెలంగాణ

విచ్చల విడిగా నల్లమట్టి దందా..!? రైతుల పేరిట అనుమతులు లక్షల సొమ్ము మూట..!?

  • రాత్రి సమయాల్లో సైతం ఆగని టిప్పర్ల మోత..!?
  • రైతుల పేరిట అనుమతులు లక్షల సొమ్ము మూట..!?
  • అతి వేగం, ఓవర్ లోడ్ లకు దద్ధరిల్లుతున్న రోడ్లు..!?
  • నిబంధనల ప్రకారం పనులు నడవని ధోరణి.. అధికారుల పర్యవేక్షణ శూన్యం.. విచ్చలవిడి తవ్వకాలు..!?
  • వందల సంఖ్యలో జిల్లా దాటుతున్న నల్ల వనరు..24 గంటలు మోత మోగుతున్న దందా..!?
  • స్థానిక ఎమ్మెల్యే నా వెంటే ఉన్నాడని ప్రచారం.. అనుమతి లొకేషన్ లో పనులు చెయ్యటం లేదని ఆరోపణలు…!?

నల్లగొండ నిఘా ప్రతినిధి (క్రైమ్ మిర్రర్): జిల్లాలోని నాంపల్లి మండలం పరిధిలోని, దామెర గ్రామ చెరువులో నల్లమట్టి తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నట్లు, అనుమతిలో పొందుపరిచిన విధంగా నియమాలను పాటించటం లేదని, అధికారులు పర్యవేక్షణ చెయ్యటం లేదంటున్నారు పలువురు..!? అతి వేగం, ఓవర్ లోడ్ లతో మర్రిగూడ మండలం రోడ్లు దద్దరిల్లుతున్నాయని, రాత్రి సమయాలలో కూడా తిప్పర్ల ద్వారా జోరుగా జిల్లా దాటి, మరో జిల్లాకు నల్ల వనరు చేరుతుందని, ఈ నల్లమట్టి దందా ద్వారా వ్యాపారులు లక్షలు సంపాదిస్తున్నారని, కానీ కనీసం రోడ్లపై నీటిని కూడా చల్లటం లేదంటున్నారు మండల ప్రజలు.. స్థానిక ఎమ్మెల్యే తన వెంట ఉన్నాడని, నన్నెవ్వరూ ఏమి చెయ్యలేరని ఆ వ్యాపారి ప్రచారం చేసుకుంటున్నట్లు అనేక ఆరోపణలు వినపడుతున్నాయి..!? అనుమతి వచ్చిన లొకేషన్ కాకుండా, వేరే లొకేషన్ లో పనులు చేస్తున్నట్లు సమాచారం..!?

పూర్తి వివరాలతో మరో క్రైమ్ మిర్రర్ కధనంతో మీ ముందుకు..

నిఘా వ్యవస్థ నిద్రిస్తే క్రైమ్ మిర్రర్ కాపు కాస్తుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button